హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం తల్లీ బిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేడు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రి మహేందర్ రెడ్డి నగరంలోని వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు.
ఇందులో భాగంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో అధికారపార్టీ నేతలకు టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆస్పత్రి వర్గాలు, అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపించారు. ఫ్లెక్సీలో స్థానిక, తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఫోటో లేకపోవడంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు మంత్రి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావుతో వాగ్వాదానికి దిగారు. మంత్రి, కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు.
కేసీఆర్ కిట్ల పంపిణీలో టీడీపీ కార్యకర్తల గొడవ
Published Sat, Jun 3 2017 1:56 PM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM
Advertisement