
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో శనివారం జరిగిన డాక్టర్ సుధాకర్ సంఘటన చంద్రబాబు నాయకత్వంలో తేర తీయబడిందని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సుధాకర్.. చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు డైరెక‌్షన్‌లో నడుస్తున్నాడని, రెండు ఎల్లో మీడియా సంస్థలు ఈ ఘటనను డ్రామాగా చూపిస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. డాక్టర్ సుధాకర్ ఘటనలో రాజకీయ కుట్ర దాగి ఆయన మండిపడ్డారు. (అనస్థీషియా వైద్యుడి వీరంగం)
దీనిపై విశాఖ కమీషనర్, డీజీపీ తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి, టీవీ5 పై కూడా విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో దళిత హక్కుల్ని కాలరాశారని ఆయన అన్నారు. సబ్ ప్లాన్ నిధుల్ని దోచేశారని, సంక్షేమ హాస్టళ్లు మూసేశారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంగ్ల విద్యా విధానం తీసుకువస్తుంటే అడ్డుకున్నది చంద్రబాబే అని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment