
మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట: మేడ్చల్ కాంగ్రెస్ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చే రెండు మూడు సీట్లు కూడా రాకుండా పోయాయని టీఆర్‌ఎస్ నేత, మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తనకు రాజకీయ ప్రయోజనం జరగడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి కాంగ్రెస్ నేతలను వాడుకుంటున్నారని, ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కాపాడటం ఎవరి వల్ల కాదని వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీని కాపాడటం, రాష్ట్ర ఇంచార్టీలు, రాహుల్ గాంధీల వల్లే కాలేదని, చివరి ఆశగా తీసుకువచ్చిన సోనియా గాంధీ వల్ల కూడా అవలేదని ఎద్దేవా చేశారు.
నిన్నటి మేడ్చల్ సభ అట్టర్ ప్లాప్ అయిందని అన్నారు. తెలంగాణాకు రావాల్సిన నీటి వాటా, ఉద్యోగుల విభజన, విద్యుత్ వాటాలను, చివరికి హైకోర్టు విభజనను కూడా అడ్డుకున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబును స్క్రిప్ట్‌ను సోనియా గాంధీ ఫాలో అయ్యారని, తెలంగాణాలో ఏమి చెబితే పార్టీకి మంచి జరుగుతుందో కూడా తెలియని నాయకత్వం, నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వందకు పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణ సభల్లో ఆంధ్రప్రదేశ్‌కు హామీలు ఇవ్వడాన్ని తప్పు పడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment