కేసుల నుంచి తప్పించుకోవడానికే... | Minister Shankar Narayana Fires on TDP Leaders Joined In BJP | Sakshi
Sakshi News home page

సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శంకర్‌ నారాయణ

Published Fri, Jun 21 2019 12:12 PM | Last Updated on Fri, Jun 21 2019 1:27 PM

Minister Shankar Narayana Fires on TDP Leaders Joined In BJP - Sakshi

సాక్షి, తిరుపతి : కేసుల నుంచి తప్పించుకునేందుకే సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్‌, గరికపాటి పార్టీ ఫిరాయించారని మంత్రి శంకర్‌ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుజనా, సీఎం రమేష్‌.. చంద్రబాబు బినామీలని ఆరోపించారు. చంద్రబాబు అంగీకారంతోనే వీరంతా పార్టీ మారారని తెలిపారు. త్వరలోనే పలువురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడతారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని శంకర్‌ నారాయణ జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. జగన్‌ నాయకత్వంలో తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement