![Minister Srinivas Goud Comments On Central Govt Over Financial Support - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/28/srinivas-goud.jpg.webp?itok=B7-UAO9m)
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అవార్డు అందజేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నాలుగైదు రాష్ట్రాలను సాకుతోందని, తాము కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పన్నుల్లో కనీసం 60 నుంచి 70 శాతమైనా వెనక్కివ్వాలని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అంతర్జాతీయ టూరిజం డే సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ జాతీయ పర్యాటక అవార్డులను అందజేయగా వాటిలో 2 తెలంగాణ అందుకుంది.
తెలంగాణకు రెండు అవార్డులు
అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అందజేసిన జాతీయ పర్యాటక అవార్డుల్లో రెండింటిని తెలంగాణ అందుకుంది. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ‘ఐ ఎక్స్‌ప్లోర్ తెలంగాణ’కు వెబ్‌సైట్ కేటగిరీలో అవార్డు లభించింది. ఇక ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం కేటగిరీలో అపోలో ఆస్పత్రికి అవార్డు లభించింది.
ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, పర్యాటక శాఖ కమిషనర్ సునీతా ఎం.భగవత్, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ బి.మనోహర్, అపోలో ఆస్పత్రి ప్రతినిధులు ఈ అవార్డులు అందుకున్నారు. పర్యాటక రంగం సమగ్రాభివృద్ధి’ విభాగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచినందుకు గాను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ నుంచి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవార్డు స్వీకరించారు. పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ 4 అవార్డులను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment