మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రులు | Ministers Leave in Middle Lokesh Tour In Anantapur | Sakshi
Sakshi News home page

మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రులు

Published Thu, Jun 14 2018 9:53 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

Ministers Leave in Middle Lokesh Tour In Anantapur - Sakshi

మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్‌

మడకశిర: రాష్ట్రమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ బుధవారం మడకశిర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన మధ్యాహ్నం 12.30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు సాగింది. అయితే ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఈ పర్యటనలో చివరి వరకు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.

జిల్లా మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఉమామహేశ్వరరావు.... నారాలోకేష్‌ పర్యటనలో పాల్గొనేందుకు మడకశిరకు వచ్చారు. అయితే నారా లోకేష్‌కు పర్యటన ప్రారంభం కాగానే మడకశిరలో ముఖం చూపించి ముగ్గురు మంత్రులు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. అలాగే ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి , శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ , టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి కూడా పర్యటన చివరి వరకు లేరు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement