
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ను ఫ్యామిలీ పార్టీ అని విమర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన భార్యకు టికెట్ ఎలా తీసుకుంటారని ఎంపీ కవిత ప్రశ్నించారు. శుక్రవారం ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కోదాడలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇప్పటికైనా తన భార్య టికెట్‌ను ఉపసంహరించుకుంటే గౌరవం దక్కుతుందని హితవు పలికారు.
రేణుకా చౌదరి రాజీనామా చేస్తారట!
కాంగ్రెస్ పార్టీకి కొత్తగా సెటిలర్లపై ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందోనన్న కవిత.. సీట్ల కేటాయింపులో భాగంగా కమ్మ వర్గానికి అన్యాయం జరిగిందనే భావనతో రేణుకా చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలను వింటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు టీడీపీని తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. రూరల్, అర్బన్ అనే తేడా లేకుండా అంతటా టీఆర్‌ఎస్ హవానే కొనసాగుతుందని.. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగిత్యాల సీటు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని కవిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment