సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కేపీఆర్
జగదేవ్‌పూర్(గజ్వేల్): రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చరిత్ర సృష్టిస్తుందని, కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుని బహుమతిగా అందిస్తామని, కాంగ్రెసోళ్లకు సీట్లు నోట్లు కావాలి తప్ప ప్రజల బాగోగలు పట్టవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం జగదేవ్‌పూర్‌లో అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఒక్కరు కూడా నిజాయితీ గల వ్యక్తులు లేరని, అందరిపైన కేసులు, దొంగ దందాలు ఉన్న వ్యక్తులేనని ఆరోపించారు. వారికి పదవులు తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ధ్యాస లేదని విమర్శించారు. సీట్లు నోట్లు కోసమే ఎమ్మెల్యే టిక్కెట్లకు పోటీ పడుతున్నారని ఆరోపించారు. కళ్ల ముందే గజ్వేల్‌లో అభివృద్ధి కనిపిస్తుందని, ఇదే ఆదర్శంగా తెలంగాణ మొత్తం జరుగుతుందన్నారు.
సమావేశంలో గజ్వేల్‌ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, మండలాధ్యక్షుడు గుండా రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు పండరీ రవీందర్‌రావు, కల్యాణ్‌కర్ నర్సింగ్‌రావు, ముద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, ఎంపీటీసీ వెంకటయ్య, మాజీ సర్పంచ్‌లు కరుణాకర్, సుధాకర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు మునీర్, జిల్లా యూత్ నాయకులు సంతోష్‌రెడ్డి, గజ్వేల్ మండలాధ్యక్షులు బెండ మధు, నాయకులుతదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment