
లక్నో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ పేరు లేకుండానే శనివారం ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ స్థానం అయిన ఆజంగఢ్ నుంచి ఈసారి ములాయం కొడుకు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో నిలవనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ శనివారం 40 మంది నేతలతో కూడిన ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. ఇందులో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్‌తోపాటు నేతలు ఆజంఖాన్, రామ్‌గోపాల్, జయా బచ్చన్ తదితరుల పేర్లున్నాయి. ములాయం పేరు లేదు. పొరపాటును గుర్తించిన పార్టీ నాయకత్వం వెంటనే ఆ జాబితాలో ఆయన పేరును చేర్చి మరో లిస్టును ఎన్నికల సంఘానికి పంపించింది..
Comments
Please login to add a commentAdd a comment