న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన దిగ్గజ నేత ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ట పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ములాయం సింగ్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ....ములాయం సింగ్ మృతితో సోషలిస్ట్ స్వరం మూగబోయింది.
ఆయన రక్షణ మంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. అంతేగాదు ఆయన అణగారిన వర్గాల కోసం చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరని చెప్పారు. దేశంలోని రాజ్యంగ విలువలను పరీరక్షించాల్సి అవసరం వచ్చినప్పుడల్లా తన మద్దతు కాంగ్రెసుకు ఉంటుందని ములాయం సింగ్ అనేవారని సోనియా గాంధీ భావోద్వేగంగా చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో గురుగ్రాంలో మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఓటమెరుగని నేత.. అయినా ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు)
Comments
Please login to add a commentAdd a comment