సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ అభయ’హస్తం’అందించింది. బీమా సౌకర్యం కల్పిస్తామంటూ ధీమా ఇచ్చింది. గల్ఫ్ దేశాలబాట పట్టిన తెలంగాణ చిన్న, సన్నకారు రైతులకు ‘రైతుబంధు’పథకం ప్రయోజనాలు చేకూరుస్తామని హామీ ఇచ్చింది. విదేశాల్లో ఉంటున్న రైతులకు కూడా రూ.5 లక్షల జీవితబీమా కల్పిస్తామని ప్రకటించింది.
ఈ మేరకు ‘గల్ఫ్ భరోసా’పేరుతో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎన్నారై పాలసీని రూపొందిస్తామని, ఎన్నారై రైతుల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ప్రతి యేటా సంక్షేమనిధి కింద రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ హామీలివే...
♦ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సమగ్ర ఎన్నారై పాలసీ
♦ గల్ఫ్ కార్మికుల సంక్షేమనిధికి ప్రతియేటా రూ.500 కోట్ల బడ్జెట్
♦ గల్ఫ్‌లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా. (గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన సంవత్సరంలోపు ఇక్కడ మరణించినవారికి కూడా వర్తింపు)
♦ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
♦ గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వలస కార్మికులకు, ఎన్నారైలకు న్యాయ సహాయం
♦ వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల్లో కొనసాగింపు. గల్ఫ్ కార్మికులకు ఆరోగ్యశ్రీ వర్తింపు
♦ వలస కార్మికులకు జీవిత, ప్రమాద బీమా, ఆరోగ్యబీమా, పెన్షన్లతో కూడిన ‘ప్రవాసీ యోగక్షేమ’ పథకం
♦ ఎన్నారైలు, గల్ఫ్ కార్మికులకు పునరావాసం
♦ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ, అవగాహన సదస్సులు
♦ గల్ఫ్‌కు వెళ్ళడానికి అవసరమై న ‘గమ్కా’మెడికల్ చెకప్ చార్జీల రీయింబర్స్‌మెంట్
♦ ఉద్యోగాల కోసం రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెల్లించాల్సిన సర్వీస్‌చార్జీలు, ఇతర ఖర్చులు బ్యాంకు రుణా ల ద్వారా మంజూరు
♦ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నారై విభాగాలు
♦ రాష్ట్రంలోని అన్ని వర్సి టీల్లో వలసలపై అధ్యయన కేంద్రాలు
♦ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాల బలోపేతం, ప్రతి సబ్ డివిజన్ కేంద్రంలో నైపుణ్య శిక్షణ కేం ద్రాలు
♦ గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రత కోసం విధివిధానాల రూపకల్పన
♦ ఏటా అధికారికంగా ‘ప్రవాసీ తెలంగాణ దివస్’
♦ గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ తెలంగాణ సంస్థలను, వ్యక్తులను గుర్తించి, అనుసం ధానపరచి ప్రోత్సహించి సమస్యల పరిష్కారంలో వారిని భాగస్వాములను చేయడం
♦ హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్, యూఏఈ కాన్సులేట్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. ఎంబసీల్లో తెలుగు అధికారుల నియామకానికి కృషి.
Comments
Please login to add a commentAdd a comment