సాక్షి, విజయవాడ : రాజధానికి భూమి ఇవ్వని గద్దె మీరా ప్రసాద్ అనే రైతుపై చంద్రబాబు ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతుందని, అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాపట్ల వైస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైకోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి మరీ మీరా ప్రసాద్ పొలంలో రోడ్డు వేశారని ఆరోపించారు. వాస్తు కోసమే ఆయన ఆ పొలంలో రోడ్డు వేయించారన్నారు. మీరా ప్రసాద్‌కు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాజధాని ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టడం కొత్తేమి కాదన్నారు. గతంలో పంటపోలాలు తగులబెట్టారని గుర్తు చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు చంద్రబాబుత తొత్తులుగా మారడం దారుణమన్నారు. తుళ్లూరు డీఎస్పీ కేశప్ప, ఏడీసీ, ఎమ్మార్వో పద్మావతి.. వీళ్లంతా టీడీపీ నేతలతో కుమ్మకై రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే మీరా ప్రసాద్ లాంటి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని పొలాలు తగలబెట్టిన కేసును తాము తెరిపించి దోషులను పట్టుకుంటామని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన మే 23న అంతమై రాజన్న రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment