Gadde Meera Prasad
-
‘నన్ను నానారకాలుగా వేధిస్తున్నారు’
సాక్షి, విజయవాడ : ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు.. తనలాంటి ఎంతో మంది రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని రాజధాని రైతు మీరా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 33 ఎకరాల భూమి ఉందని... అయితే పాస్‌బుక్కులు మార్చి తనను రకరకాలుగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఐదేళ్లుగా తన భూమిని కాపాడుకోవడం రాత్రిళ్లు కూడా చేనులోనే పడుకుంటున్నానని తన పరిస్థితి గురించి వివరించారు. కొందరు అధికారులు లంచాలు తిని రికార్డులు తారుమారు చేసి తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కోర్టు ఆర్డర్ ఉందని చెప్పినా తన మాట వినకుండా దౌర్జన్యం చేస్తూ దుర్మారంగా వ్యవహరించారని ఆవేదన చెందారు. కాగా రాజధానికి భూమి ఇవ్వని గద్దె మీరా ప్రసాద్ అనే రైతు పొలంలో రోడ్డు వేసేందుకు అధికారులు శనివారం ప్రయత్నించగా అందుకు అతడు అడ్డుకోవడంతో పోలీసుల దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే. రైతును బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ పెనుగలాటలో మీరా ప్రసాద్ కిందపడిపోయి అస్వస్థతకు గురయ్యారు. అయినా నిర్దయగా వ్యవహరించిన పోలీసులు... అలాగే ఆయన్ని పట్టుకుని వ్యాన్ ఎక్కించారు. అంతేకాకుండా మీరా ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన మీరా ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నేను రాజధానికి భూమి ఇవ్వకపోయినా అధికారులు ఈరోజు నాపై దౌర్జన్యం చేసి...నా పొలంలో రోడ్డు వేశారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకున్నందుకు పోలీసులు నాపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఏమీ చేసినా నేను భయపడను. ఇవాళ పోలీసులు నాపట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. నా అనుమతి లేకుండా పొలంలో రోడ్డు వేస్తూ నాపై దురుసుగా ప్రవర్తించారు. అధికారుల తీరుతో పాటు, నా మీద పెట్టిన అక్రమ కేసుపై కోర్టుకు వెళతాను. ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం. నాలుగేళ్ల నుంచి నా భూమిని కాపలా కాస్తూ కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఇవాళ దౌర్జన్యం చేసి పొలంలో రోడ్డు వేశారు. దీనిపై పోరాటం చేస్తా. వదిలిపెట్టను. నన్ను ఎన్నిరోజులు జైల్లో పెడతారు. మళ్లీ బెయిల్ మీద విడుదల అవుతా. పోరాటం చేస్తాను. నా పొలాన్ని నేను దక్కించుకుంటా. ఎన్నికలు అయ్యేవరకూ ఉండి...ఇప్పుడు మళ్లీ నాటకాలు వేస్తున్నారు.’ అంటూ మీరా ప్రసాద్ మండిపడ్డారు. -
వాస్తు కోసం చంద్రబాబు అలా చేశాడు
సాక్షి, విజయవాడ : రాజధానికి భూమి ఇవ్వని గద్దె మీరా ప్రసాద్ అనే రైతుపై చంద్రబాబు ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతుందని, అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాపట్ల వైస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైకోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి మరీ మీరా ప్రసాద్ పొలంలో రోడ్డు వేశారని ఆరోపించారు. వాస్తు కోసమే ఆయన ఆ పొలంలో రోడ్డు వేయించారన్నారు. మీరా ప్రసాద్‌కు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టడం కొత్తేమి కాదన్నారు. గతంలో పంటపోలాలు తగులబెట్టారని గుర్తు చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు చంద్రబాబుత తొత్తులుగా మారడం దారుణమన్నారు. తుళ్లూరు డీఎస్పీ కేశప్ప, ఏడీసీ, ఎమ్మార్వో పద్మావతి.. వీళ్లంతా టీడీపీ నేతలతో కుమ్మకై రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే మీరా ప్రసాద్ లాంటి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని పొలాలు తగలబెట్టిన కేసును తాము తెరిపించి దోషులను పట్టుకుంటామని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన మే 23న అంతమై రాజన్న రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
రాజధాని రైతు మీరా ప్రసాద్‌పై కేసు నమోదు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతంలో అధికారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమరావతి సాక్షిగా ఓ రైతుపై పోలీసులు దాష్టీకానికా పాల్పడ్డారు. రాజధానికి భూమి ఇవ్వని గద్దె మీరా ప్రసాద్ అనే రైతు పొలంలో రోడ్డు వేసేందుకు అధికారులు శనివారం ప్రయత్నించగా అందుకు అతడు అడ్డుకోవడంతో పోలీసుల దౌర్జన్యానికి దిగారు. రైతును బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ పెనుగలాటలో మీరా ప్రసాద్ కిందపడిపోయి అస్వస్థతకు గురయ్యారు. అయినా నిర్దయగా వ్యవహరించిన పోలీసులు... అలాగే ఆయన్ని పట్టుకుని వ్యాన్ ఎక్కించారు. అంతేకాకుండా మీరా ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి.....(నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత: మీరా ప్రసాద్) అనంతరం బెయిల్‌పై విడుదలైన మీరా ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నేను రాజధానికి భూమి ఇవ్వకపోయినా అధికారులు ఈరోజు నాపై దౌర్జన్యం చేసి...నా పొలంలో రోడ్డు వేశారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకున్నందుకు పోలీసులు నాపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఏమీ చేసినా నేను భయపడను. ఇవాళ పోలీసులు నాపట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. నా అనుమతి లేకుండా పొలంలో రోడ్డు వేస్తూ నాపై దురుసుగా ప్రవర్తించారు. అధికారుల తీరుతో పాటు, నా మీద పెట్టిన అక్రమ కేసుపై కోర్టుకు వెళతాను. ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం. నాలుగేళ్ల నుంచి నా భూమిని కాపలా కాస్తూ కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఇవాళ దౌర్జన్యం చేసి పొలంలో రోడ్డు వేశారు. దీనిపై పోరాటం చేస్తా. వదిలిపెట్టను. నన్ను ఎన్నిరోజులు జైల్లో పెడతారు. మళ్లీ బెయిల్ మీద విడుదల అవుతా. పోరాటం చేస్తాను. నా పొలాన్ని నేను దక్కించుకుంటా. ఎన్నికలు అయ్యేవరకూ ఉండి...ఇప్పుడు మళ్లీ నాటకాలు వేస్తున్నారు.’ అంటూ మీరా ప్రసాద్ మండిపడ్డారు. -
నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత: మీరా ప్రసాద్
సాక్షి, అమరావతి : సచివాలయం సాక్షిగా ఏపీ రాజధానికి భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యం కొనసాగుతోంది. భూములు ఇవ్వని రైతులను సీఆర్డీఏ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. సచివాలయం పక్కనే... రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు వేయడానికి సీఆర్డీఏ అధికారులు సిద్ధం అయ్యారు. వెలగపూడికి చెందిన గద్దే రైతు మీరా ప్రసాద్ తన పొలంలో రోడ్డు వేయడానికి యత్నించిన సీఆర్డీఏ అధికారుల యత్నాలను అడ్డుకున్నాడు. మీరా ప్రసాద్ ఈ సందర్భంగా అధికారులతో వాగ్వివాదాన్ని అడ్డుకున్నారు. సీఆర్డీఏ అధికారులు రోజు ఫోన్ చేసి తన పొలంలో రోడ్డు వేస్తామని బెదిరిస్తున్నారని, రాజధానికి భూమి ఇవ్వనందుకు తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని మీరా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులతో తన ఆరోగ్యం క్షీణిస్తోందని, తనకు ఏమైనా అయితే సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. తన పొలంలో దౌర్జన్యంగా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారని, నాలుగు రోజులు నుంచి తాను ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే కాపలా కాస్తున్నట్లు తెలిపారు. గతంలో తనను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి తన భూమిలో బలవంతంగా సచివాలయం గోడ కట్టారని మీరా ప్రసాద్ వెల్లడించారు. కాగా తాత్కాలిక సచివాలయం వెనుకనున్న సీఆర్డీఏ నిర్మిస్తున్న ఎన్9 రహదారి నిర్మాణ పనులు నిలిపి వేయాలని సర్వేనెంబర్ 214/ఏ లో గద్దే మీరా ప్రసాద్ అనే రైతు తన భూమిలో రహదారి నిర్మాణం జరుగుతుందని, ఆ నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి పోలీసులను అడ్డుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే విషయంపై నాలుగు రోజుల క్రితం తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీలులేదని అడిగినందుకు మీరా ప్రసాద్‌ను పోలీసులు దారుణంగా బట్టలు చిరిగేలా కొట్టారు. సీఐ సుధాకర్ బాబు రైతుపై చేయికూడా చేసుకుని, బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మీరా ప్రసాద్ సొమ్మసిల్లి పడిపోవడంతో, రైతు వద్ద నుంచి పోలీసులు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. -
నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత: మీరా ప్రసాద్