సచివాలయం సాక్షిగా ఏపీ రాజధానికి భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యం కొనసాగుతోంది. భూములు ఇవ్వని రైతులను సీఆర్‌డీఏ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. సచివాలయం పక్కనే... రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు వేయడానికి సీఆర్‌డీఏ అధికారులు సిద్ధం అయ్యారు. వెలగపూడికి చెందిన గద్దే రైతు మీరా ప్రసాద్ తన పొలంలో రోడ్డు వేయడానికి యత్నించిన సీఆర్‌డీఏ అధికారుల యత్నాలను అడ్డుకున్నాడు. మీరా ప్రసాద్ ఈ సందర్భంగా అధికారులతో వాగ్వివాదాన్ని అడ్డుకున్నారు.