crda officers
-
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు
సాక్షి, అమరావతి: చట్ట నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అక్రమ కట్టడాల నిర్మాణం జరుగుతుంటే గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. గత ప్రభుత్వం కళ్లుమూసుకుని చేసిన తప్పును తాము చేయబోమంది. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. కృష్ణానది, కరకట్ట సమీపంలో రైతు సంఘం భవన్ పేరుతో నిర్మించిన అక్రమ కట్టడం కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ చందన కేదారీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు సీఆర్డీఏ ప్రాథమిక ఉత్తర్వుల అమలును మూడు వారాల పాటు నిలిపేస్తూ గత వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఆర్డీఏ కమిషనర్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనుమతులు లేవని పిటిషనరే ఒప్పుకున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, రైతు సంఘం భవన్ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని పిటిషనరే ఒప్పుకున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలని భావించిన వాటి కూల్చివేతలో భాగంగా పిటిషనర్ భవనానికి సైతం షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఆ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు గడువు కోరి, ఆ వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వివరించారు.కృష్ణానదికి 100 మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలు ఉండడానికి వీల్లేదని ఎన్జీటీ 2017లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. రాజధాని ప్రాంత పరిధిలో అభివృద్ధిని క్రమబద్ధీకరించే విషయంలో సీఆర్డీఏకు అన్ని అధికారాలున్నాయని, నదీ ప్రాంతాల పరిరక్షణ, అభివృద్ధి కూడా సీఆర్‌డీఏదేనని అన్నారు. సీఆర్డీఏ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై పిటిషనర్‌కు ఏవైనా అభ్యంతరాలుంటే, వాటిపై ఉన్నతాధికారులను ఆశ్రయించే ప్రత్యామ్నాయం ఉందన్నారు. దీనిని ఉపయోగించుకోకుండా పిటిషనర్ నేరుగా పిటిషన్ దాఖలు చేశారని, ఇలా దాఖలు చేసే వ్యాజ్యాలను విచారించేందుకు హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదని ఏజీ తెలిపారు. అవి కేవలం తాత్కాలిక ఉత్తర్వులే.. ఆ తరువాత పిటిషనర్ కేదారీష్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చింది కేవలం తాత్కాలిక ఉత్తర్వులు మాత్రమేనన్నారు. తాత్కాలిక ఉత్తర్వులపై దాఖలు చేసే అప్పీల్‌కు విచారణార్హత లేదన్నారు. తమ భవనం అక్రమ కట్టడమని అంతిమ నిర్ణయానికి వచ్చిన తరువాతనే షోకాజ్ నోటీసు ఇచ్చారని, ఇది అన్యాయమన్నారు. అసలు వంద మీటర్ల లోపు నిర్మాణాలను కూల్చివేయాలని ఎన్జీటీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని వాదించారు. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఎన్జీటీ ఏ కేసులో ఆదేశాలు ఇచ్చిందీ.. ఆ కేసు నంబర్, ఆదేశాలు ఇచ్చిన సంవత్సరం తదితర వివరాలను వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
నిన్న అసెంబ్లీ, సచివాలయం.. నేడు హైకోర్టు..
సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలోని తాత్కాలిక నిర్మాణాల్లో డొల్లతనం మరోమారు బట్టబయలైంది. గతంలో చిన్నపాటి వర్షాలకే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో సంభవించిన లీకేజీలను మర్చిపోక ముందే తాజాగా తాత్కాలిక హైకోర్టు భవనంలోని జనరేటర్ గదులకు సంబంధించిన శ్లాబ్ కూలడంతో ఈ భవనం నాణ్యతపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జనరేటర్ రూంకు సంబంధించి ఆరు గదులను నిర్మిస్తుండగా అందులో రెండు గదుల్లోని శ్లాబ్ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలింది. అక్కడే పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన నలుగురు కూలీలు గాయపడడంతో అధికారులు హుటాహుటిన వారిని తాడేపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. కాగా, నిర్మాణాల్లో డొల్లతనం ఎక్కడ బయటపడుతోందోనన్న భయంతో సీఆర్డీఏ అధికారులు శనివారం మీడియా ప్రతినిధులు ఎవరినీ ఆ ఛాయలకు అనుమతించలేదు. నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి చిన్నచిన్న సంఘటనలు చోటుచేసుకుంటాయని.. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయొద్దని అధికారులు హెచ్చరించారు. అక్కడే ఉన్న కూలీలతో కూడా మీడియాను మాట్లాడనివ్వలేదు. గాయపడిన కూలీలు.. వారి పేర్లు.. ఎక్కడ చికిత్స చేయిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లనీయకుండా మీడియాను అడ్డుకుంటున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని సుమోటాగా తీసుకోవాలి తాత్కాలిక హైకోర్టు వద్ద జరిగిన ప్రమాదాన్ని హైకోర్టు సుమోటా తీసుకుని విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణంలో పాటిస్తున్న ప్రమాణాలు, నాణ్యత వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని వారు కోరుతున్నారు. నాణ్యత, భద్రత విషయాల్లో రాజీపడితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, హడావుడిగా నిర్మాణాలు చేస్తున్న క్రమంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తంచేశారు. ఇదే విషయమై హైకోర్టు న్యాయవాది ఓలేటి లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ సభ్యులతో కలిసి మంగళవారం తాత్కాలిక హైకోర్టు నిర్మాణంలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, నాణ్యతను పరిశీలిస్తామని చెప్పారు. అందుబాటులో లేని ‘108’ ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో ఒక్క 108 వాహనాన్ని కూడా ఏర్పాటుచేయకపోవడం గమనార్హం. తుళ్లూరు మండలంలో ఉన్న ఏకైక వాహనానికి డ్రైవర్ లేకపోవడంతో సర్వీస్ నిలిచిపోయింది. హైకోర్టు వద్ద ప్రమాదం జరిగిన సమయలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో కారులో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
అమరావతిలో CRDA అధికారుల నిర్లక్షానికి ఇద్దురు బలి
-
రూ.10 కోట్లు పలికే చోట రూ.39 లక్షలేనా?
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రస్తుతం ఎకరం రూ.6 కోట్ల నుంచి రూ. 10 కోట్ల దాకా పలికే ప్రాంతంలో విలువైన తమ భూములు తీసుకుని ఎకరాకు రూ.39 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నించారు. భూ సేకరణ నోటీసులపై అభ్యంతరాలను స్వీకరించేందుకు బుధవారం ఉండవల్లికి వచ్చిన సీఆర్డీఏ అధికారులను రైతులు పలు ప్రశ్నలతో నిలదీయటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తమకు సమాధానం చెప్పాలని లేదంటే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రైతులంతా పట్టుబట్టారు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: గజానికి రూ. 4,400 చొప్పున ధర నిర్ణయించామని, దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్ కలిపితే గజానికి రూ.5,500 వస్తుందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రజనీకుమారి రైతులకు చెప్పారు. ఈ మొత్తానికి భూ సేకరణ చట్టం 2013 ప్రకారం రెండున్నర రెట్లు పరిహారం అందజేస్తామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం రూ.50 వేలు పలుకుతుంటే రూ.5 వేలు ఇస్తామనడం ఏమిటని రైతులు మండిపడ్డారు. సెక్షన్ 21(5) ప్రకారం నోటీసులు తీసుకోని రైతుల వివరాలతో పత్రికల్లో ప్రకటన ఇచ్చిన 30 రోజుల తర్వాత అవార్డు ఎంక్వైరీ చేపట్టాలన్నారు. సెక్షన్ 19(1) ప్రకారం రూఢీ ప్రకటనకు ముందే రైతులకు అందజేసే పరిహారాన్ని కలెక్టర్ ఖాతాకు ప్రభుత్వం జమ చేసి ఉండాలని పేర్కొన్నారు. రైతులు న్యాయపరమైన అంశాలతో నిలదీయటంతో సమాధానం చెప్పలేక అధికారులు తెల్లబోయారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు సహకరిస్తే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. బాబు తాతనైనా ఎదిరిస్తాం: మా భూముల జోలికొస్తే చంద్రబాబునే కాదు.. ఆయన తాతనైనా ప్రశ్నిస్తామని రాజధాని రైతులు హెచ్చరించారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఎదిరిస్తామని స్పష్టం చేశారు. తమ భూములకు పరిహారం ఎప్పుడు, ఎంత జమ చేశారో చెప్పాలన్నారు. సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్న రైతులు: తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులకు భూసేకరణ కింద నోటీసులు జారీ చేసిన అధికారులు అభ్యంతరాలుంటే గ్రామంలోని సీఆర్డీఏ కార్యాలయంలో తెలపాలని సూచించారు. దీంతో సుమారు 60 మంది రైతులు బుధవారం కార్యాలయానికి చేరుకుని భూములపై తమ అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో చెప్పాలంటూ నిలదీశారు. కాగా, భూ సేకరణ చట్టం సెక్షన్ 12, 20ల ప్రకారం సీఆర్డీఏ అధికారులు చేసిన సర్వే అంతా బోగస్ అని ఇట్టే తెలిసిపోతోందని అడ్వకేట్ సీహెచ్ నిర్మలత తెలిపారు. ఉండవల్లి సెంటర్లో సర్వే నంబర్ 12(1సీ)లో మాడా పున్నారావుకు చెందిన మూడంతస్తుల భవనం ఉంటే అధికారులు అది ఖాళీ స్థలంగా చూపుతున్నారన్నారు. కృష్ణా కరకట్టకు ఉత్తరం వైపున ఇస్కాన్ ఆలయం నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని ఖాళీగా చూపిస్తున్నారని, సర్వే అంతా లోపభూయిష్టమన్నారు. -
ఏపీ రాజధానిలో సీఆర్డీఏ అధికారుల బరితెగింపు
-
నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత: మీరా ప్రసాద్
సాక్షి, అమరావతి : సచివాలయం సాక్షిగా ఏపీ రాజధానికి భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యం కొనసాగుతోంది. భూములు ఇవ్వని రైతులను సీఆర్డీఏ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. సచివాలయం పక్కనే... రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు వేయడానికి సీఆర్డీఏ అధికారులు సిద్ధం అయ్యారు. వెలగపూడికి చెందిన గద్దే రైతు మీరా ప్రసాద్ తన పొలంలో రోడ్డు వేయడానికి యత్నించిన సీఆర్డీఏ అధికారుల యత్నాలను అడ్డుకున్నాడు. మీరా ప్రసాద్ ఈ సందర్భంగా అధికారులతో వాగ్వివాదాన్ని అడ్డుకున్నారు. సీఆర్డీఏ అధికారులు రోజు ఫోన్ చేసి తన పొలంలో రోడ్డు వేస్తామని బెదిరిస్తున్నారని, రాజధానికి భూమి ఇవ్వనందుకు తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని మీరా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులతో తన ఆరోగ్యం క్షీణిస్తోందని, తనకు ఏమైనా అయితే సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. తన పొలంలో దౌర్జన్యంగా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారని, నాలుగు రోజులు నుంచి తాను ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే కాపలా కాస్తున్నట్లు తెలిపారు. గతంలో తనను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి తన భూమిలో బలవంతంగా సచివాలయం గోడ కట్టారని మీరా ప్రసాద్ వెల్లడించారు. కాగా తాత్కాలిక సచివాలయం వెనుకనున్న సీఆర్డీఏ నిర్మిస్తున్న ఎన్9 రహదారి నిర్మాణ పనులు నిలిపి వేయాలని సర్వేనెంబర్ 214/ఏ లో గద్దే మీరా ప్రసాద్ అనే రైతు తన భూమిలో రహదారి నిర్మాణం జరుగుతుందని, ఆ నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి పోలీసులను అడ్డుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే విషయంపై నాలుగు రోజుల క్రితం తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీలులేదని అడిగినందుకు మీరా ప్రసాద్‌ను పోలీసులు దారుణంగా బట్టలు చిరిగేలా కొట్టారు. సీఐ సుధాకర్ బాబు రైతుపై చేయికూడా చేసుకుని, బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మీరా ప్రసాద్ సొమ్మసిల్లి పడిపోవడంతో, రైతు వద్ద నుంచి పోలీసులు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. -
నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత: మీరా ప్రసాద్
-
సీఆర్డీఏ చెప్పిందే తప్ప నేను చెప్పేది వినలేదు
-
రాజధాని రైతులపై పోలీసుల దౌర్జన్యం
-
రాజధాని రైతులపై పోలీసుల దౌర్జన్యం
తుళ్లూరురూరల్ : రాజధాని అమరావతి ప్రాంతం రైతులకు తాత్కాలిక సచివాలయం సాక్షిగా అణచివేతకు గురవుతున్నారు. వెలగపూడికి చెందిన గద్దే మీరాప్రసాద్ అనే రైతు తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీలులేదని అడిగినందుకు రైతును పోలీసులు దారుణంగా బట్టలు చిరిగేలా కొట్టారు. సీఐ సుధాకర్ బాబు రైతుపై చేయికూడా చేసుకున్నాడు. అనంతరం బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో, రైతు వద్ద నుంచి పోలీసులు వెళ్లిపోయారు.. బాధిత రైతుకు మద్దతు తెలిపిన సీపీఎం, వైఎస్సార్ సీపీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు ఎలా వేస్తారంటూ రైతు మీరా ప్రసాద్ నిలదీశారు. తాత్కాలిక సచివాలయం వెనుకనున్న సీఆర్డీఏ నిర్మిస్తున్న ఎన్9 రహదారి నిర్మాణ పనులు నిలిపి వేయాలని సర్వేనెంబర్ 214/ఏ లో గద్దే మీరాప్రాద్ అనే రైతు భూమిలో రహదారి నిర్మాణం జరుగుతుందని, నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి పోలీసులను అడ్డుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన సీఆర్డీఏ డెప్యూటీ కలెక్టర్ విజయకుమారిని వివరణ కోరగా తాము పోలీసులకు భద్రత మాత్రమే కల్పించమని అడిగినట్లు తెలిపారు. -
కౌలు రైతు పొలం ధ్వంసం చేసిన అధికారులు
-
సీఆర్డీఏ సమావేశంలో రభస
-
సీఆర్డీఏ అధికారులకు చుక్కెదురు
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు.
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు కూల్చివేతలు జరగగా, తాజాగా సీఆర్డీఏ అధికారులు బుధవారం క్యాంటీన్‌ను కూల్చివేశారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు క్యాంటీన్ కూల్చివేయడాన్ని క్యాంటిన్ నిర్వహకులు తప్పుబట్టారు. మంత్రి నారాయణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహించేందుకు మూడేళ్లు లీజుకు ఇచ్చారని, రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాక...ఇప్పుడు కూల్చివేతలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాల్లో సచివాలయంలో పలు బ్లాక్‌లను కూల్చి అధికారులు మళ్లీ కట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఆర్డీఏ అధికారులు మాత్రం కూల్చివేతలపై పెదవి విప్పడం లేదు. కాగా వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఇప్పటికే పలుసార్లు మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
రాజధానిలో సీఆర్డీఏ అధికారుల హడావుడి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన దృష్ట్యా సీఆర్డీఏ అధికారులు హడావుడి సృష్టిస్తున్నారు. తుళ్లూరు సీఆర్డీఏ ఆఫీస్ వద్ద గురువారం అధికారులు సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ పర్యటనలో అభ్యంతరం తెలపాలంటూ రైతులకు సూచించారు. గత కొంతకాలంగా వాయిదా వేస్తున్న ప్లాట్ల కేటాయింపులను అధికారులు హడావుడిగా గురువారం చేపట్టారు. మధ్యాహ్నం మందడం గ్రామస్తులకు ప్లాట్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ రాకతో సీఆర్డీఏ అధికారులు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. అధికారుల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కావాల్సిన చోట స్థలాలు ఇస్తామని చెప్పి..
-
కావాల్సిన చోట ఇస్తామని చెప్పి..
గుంటూరు: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకునేటప్పుడు వారికి కావాల్సిన చోట ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చడంతో.. రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ప్లాట్ల విషయంలో తుళ్లురు మండలం శాకమూరులో సీఆర్డీఏ అధికారుల సదస్సు సోమవారం గదరగోళంగా మారింది. సదస్సులో సీఆర్డీఏ అధికారులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మీకు నచ్చిన చోట ప్లాట్లు ఇస్తాం అని చెబుతూ భూములను లాక్కున్న అధికారులు ఇప్పుడు మాటమార్చడంతో సదస్సులో పాల్గొన్న రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'మాకు నచ్చిన చోట ప్లాట్లు ఇస్తేనే తీసుకుంటాం' అని అధికారులతో రైతులు తెగేసి చెప్పారు. ఇచ్చిన చోట తీసుకోవాలంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
తాత్కాలిక శాసనసభలో అన్ని వసతులు ఉండాల్సిందే
హైదరాబాద్ :సాధారణ పరిపాలనా వ్యవస్ధల అవసరాలు, చట్ట సభలకు సంబంధించిన కార్యకలాపాలు భిన్నంగా ఉంటాయని తదనుగుణంగా తాత్కాలిక శాసనసభ రూపుదిద్దుకోవలసి ఉందని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేసారు. కేవలం శాసనసభ నిర్మాణం మాత్రమే కాకుండా దాదాపు 200 మంది ఉద్యోగులు సభ అవసరాలకు అనుగుణంగా పనిచేయగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మంగళవారం స్పీకర్‌తో సీఆర్డీఏ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఇప్పటికే రూపొందించిన శాసనసభ నిర్మాణ నమూనాను పరిశీలించిన సభాపతి సభ నిర్వహణకు కావలసిన వసతుల గురించి చర్చించారు. తాత్కాలికమే అయినా ప్రస్తుతం వెలగపూడిలో చేపట్టే నిర్మాణాలలో అన్ని వసతులు ఉండవవలసిందేనని కోడెల సూచించారు. క్యాంటిన్‌తో పాటు లైబ్రరీ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. చట్టసభలకు ప్రధానంగా గ్రంధాలయ అవశ్యకత ఉందని, తదనుగుణంగా విశాలమైన ఏర్పాటు ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు వినియోగిస్తున్న శాసనసభ భవనాలకు కూలంకషంగా పరిశీలించాలని, తద్వారా మరింత మెరుగైన వసతులతో తాత్కాలిక సచివాలయం ఎలా నిర్మించాలన్న దానిపై అవగాహనకు రావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, సీఆర్డీఏ సీనియర్ ఆర్కిటెక్చర్ రాహుల్ తదితరులు పాల్లొన్నారు. -
సీఆర్డీఏ అధికారులకు చేదు అనుభవం
విజయవాడ: సీఆర్డీఏ అధికారులకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెంలో శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఫ్లాట్ల పంపిణీపై సీఆర్డీఏ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అయితే రైతులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలాంటి సదస్సులు ఎన్ని నిర్వహిస్తారంటూ రైతులు ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు. ఇప్పటి వరకు ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అంటూ రైతులు అడిగిన ప్రశ్నకు అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులురెడ్డి నీళ్లు నమిలారు. 13 జిల్లాల కోసం 29 గ్రామాల ప్రజల బలి పశువులు కావాలా అని సదస్సుకు హాజరైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లైఓవర్
- ఆరు వరుసలుగా హైవే విస్తరణ - ఏడు కిలోమీటర్ల మేర ఏలూరు కాలువ మళ్లింపు - సీఆర్డీఏ సమీక్షలో సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో : గన్నవరం ఎయిర్‌పోర్టు ఎంట్రన్స్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో ఆయన రాజధాని వ్యవహారాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు అప్రోచ్‌రోడ్డును హైవే వరకు నాలుగు లైన్లుగా విస్తరించి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. హైవే, విమానాశ్రయం ట్రాఫిక్‌కు సంబంధం లేకుండా ఉండేలా దీన్ని నిర్మించాలని సూచించారు. భారీ విమానాలు ఆగేందుకు వీలుగా రన్‌వే విస్తరణ కోసం ఏలూరు కాలువను ఏడు కిలోమీటర్లు మళ్లించే పనులను 40 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెండు ఆర్ అండ్ బీ రోడ్లను మూడు కిలోమీటర్ల మేర మళ్లించే పనులను 45 రోజుల్లో చేయాలని సూచించారు. విశాఖపట్నం - విజయవాడ, చెన్నయ్ - నెల్లూరు, విజయవాడ - బందరు జాతీయ రహదారులను ఆరు వరుసలుగా విస్తరించాలని, ఇందుకోసం వెంటనే సవివర నివేదికలు తయారు చేయాలని సీఎం హైవే అధికారులను కోరారు. పండుగలా రాజధాని శంకుస్థాపన .. అక్టోబర్ 22వ తేదీన రాజధాని శంకుస్థాపనను పండుగలా చేయాలని, ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య మంత్రి ఈ కార్యక్రమానికి వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుతెలిపారు. శంకుస్థాపన పైలాన్ భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని ఒక పార్కుగా తయారు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 29 రాజధాని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని, దాన్లో గ్రామస్తులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. గ్రామకంఠాలకు ఆనుకుని ఉన్న 8 వేల ఎకరాలను భూసమీకరణ కింద ఇస్తామని పెదపరిమి, హరిశ్చంద్రాపురం, వడ్డమాను గ్రామాల రైతులు ముందుకు వచ్చారని, దీన్ని పరిశీలించాలని సీఆర్డీఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కార్యాలయాల తరలింపును వేగవంతం చేయాలని సూచించి అధికారులకు అవసరమైన నివాస సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. -
వెలవెలబోయిన చెక్కుల పంపిణీ కార్యక్రమం
కంగుతిన్న వ్యవసాయ మంత్రి తాడేపల్లి రూరల్ : మండలంలోని పెనుమాక గ్రామంలో గురువారం సీఆర్డీఏ అధికారులు నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం వెలవెలబోయింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆహ్వానించారు. గ్రామ సర్పంచ్ నివాసంలో భారీ స్థాయిలో టెంట్లు వేసి, కుర్చీలు ఏర్పాటు చేసి, సభావేదికను సిద్ధం చేశారు. అమాత్యుల వారు వస్తున్నారంటూ అధికారులు హడావుడి చేశారు. మంత్రి రాక ఆలస్యం కావడంతో రైతులు ఎవరూ లేరు. దీంతో కంగుతిన్న అమాత్యులు స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించారు. అప్పటికీ రైతులు రాకపోవడంతో సభా వేదిక వద్ద వద్దులే.. సర్పంచ్ ఇంటి వద్దే చెక్కులు పంపిణీ చేద్దామని మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 60కి పైగా చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి 12 చెక్కులు పంపిణీ చేసి, ప్రభుత్వం గురించి పొగడ్తల వర్షం కురిపించి, మిగిలినవారు రాకపోవడంతో అక్కడ నుంచి నిష్ర్కమించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భూసమీకరణకే రైతులు మొగ్గుచూపుతున్నారని, అందుకే సేకరణ వాయిదా వేశామన్నారు. రుణమాఫీలకు కట్టుబడి ఉన్నామని చెబుతుండగా, ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడు తనకు రుణమాఫీ జరగలేదంటూ మంత్రిని నిలదీశాడు. స్థానిక నాయకులు ఎంతగా వారించినా వినకపోగా, తనకు ఎందుకు రుణమాఫీ జరగదంటూ ప్రశ్నించాడు. దీంతో కంగుతిన్న నాయకులు మంత్రితో బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేయించి మాట్లాడించి అతడిని శాంతింపజేశారు. -
సీఆర్ డీఏ అధికారులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు: సీఆర్ డీఏ అధికారులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి మండల కార్యాలయ అధికారులు నిడమర్రు, కొరగల్లు గ్రామాల్లో 9.3 తో పాటు 9.2 పత్రాలు తీసుకోవటం లేదని రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సీఆర్ డీఏ అధికారుల వైఖరికి నిరసనగా నిడమర్రులో భిక్షాటన చేపట్టారు.