విజయవాడ: సీఆర్డీఏ అధికారులకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెంలో శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఫ్లాట్ల పంపిణీపై సీఆర్డీఏ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అయితే రైతులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలాంటి సదస్సులు ఎన్ని నిర్వహిస్తారంటూ రైతులు ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు.
ఇప్పటి వరకు ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అంటూ రైతులు అడిగిన ప్రశ్నకు అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులురెడ్డి నీళ్లు నమిలారు. 13 జిల్లాల కోసం 29 గ్రామాల ప్రజల బలి పశువులు కావాలా అని సదస్సుకు హాజరైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.