సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. బుధవారం ఆయన మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలతో ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రియాంక రాజకీయ ఎంట్రీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొందరికి కుటుంబమే పార్టీ అని, అయితే బీజేపీకి మాత్రం పార్టీయే కుటుంబమని చెప్పారు.(అందుకే ప్రియాంకకు పదవి: రాహుల్)
‘మన పార్టీలో ఎలాంటి నిర్ణయాలు అయినా ఒకే కుటుంబం తీసుకోదు. అందరితో చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కరి ఆలోచన విధానాలపై పార్టీ నిర్ణయాలు ఉండవు. మన పార్టీకి కార్యకర్తలే కుటుంబం. కొందరికి కుటుంబంమే పార్టీ. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను పాటిస్తుంది. మన పార్టీని కార్యకర్తలతో నిర్మించుకున్నాం. ఎలాంటి నిర్ణయాలు అయినా అందరం కలిసి తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ దేశానికి అంకితం. దేశంలో ప్రజాస్వామ్య విలువలను పాటించే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయే’ అని మోదీ చెప్పుకొచ్చారు. (ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్ బాధ్యతలను కూడా అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment