
సాక్షి, న్యూఢిల్లీ : దేశం యావత్తు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. భారత ప్రధానిగా వరుసగా రెండోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దైవ సాక్షిగా ప్రమాణ చేశారు. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ మోదీతో ప్రమాణం చేయించారు. దేశ, విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు వంటి సుమారు 8 వేల మంది విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీతో సహా 25 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర సహాయ మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
- సహాయమంత్రులుగా.. ఫాగిన్‌సింగ్ కులస్తే, అశ్వని చౌబే, అర్జున్‌రామ్ మేఘ్వాల్, వీకే సింగ్, కిషన్‌పాల్ గుర్జార్, దాదారావ్ పాటిల్, జి.కిషన్ రెడ్డి, పరుషోత్తమ్ రూప్లా, రామ్‌దాస్ అథవాలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో, సంజీవ్‌కుమార్ బాల్యన్, సంజయ్ శామ్‌రావ్ దోత్రే, అనురాగ్‌సింగ్ ఠాకూర్, సురేష్ అంగాడిచెన్నబసప్ప, నిత్యానంద్‌రాయ్, రతన్‌లాల్ కటారియా, వి.మురళీదరన్, శ్రీమతి రేణుకాసింగ్ సార్తా, సోమ్‌ప్రకాశ్, రామేశ్వర్ తేలి, ప్రతాప్‌చంద్ర సారంగి, కైలాష్ చౌదరీ, శ్రీమతి దేబర్సీ చౌదురీ ప్రమాణం చేశారు.
- స్వతంత్ర హోదా సహాయమంత్రులుగా.. సంతోష్ గంగ్వార్, రావ్ ఇంద్రజీత్‌సింగ్, శ్రీపాద నాయక్ ,జితేంద్రసింగ్, కిరన్ రిజిజు, ప్రహ్లాద్‌సింగ్ పటేల్, రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్‌సింగ్ పూరి, మన్సూ్‌ఖ్ మాండవీయ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
- కేబినెట్ మంత్రులుగా.. రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, శ్రీమతి నిర్మలా సీతారామన్, రామ్‌విలాస్ పాశ్వాన్, నరేంద్రసింద్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, శ్రీమతి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, థావర్‌చంద్ గెహ్లాట్, సుబ్రమణ్యం జయశంకర్, రమేష్ పోఖ్రియాల్, అర్జున్ ముండా, శ్రీమతి స్మృతి ఇరానీ, డాక్టర్ హర్షవర్థన్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి, డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, అరవింద్ సావంత్, గిరిరాజ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్ ప్రమాణం చేశారు.
- ప్రధాని మోదీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనతోపాటు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేస్తారని భావిస్తున్న.. అరవింద్ సావంత్, అనుప్రియ పాటిల్, రతన్ లాల్ కటారియా, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, ఆర్‌సీపీ సింగ్, జి కిషన్ రెడ్డి, సురేష్ అంగడి , ఏ రవీంద్రన్, కైలాష్ చౌదరి , ప్రహ్లాద్ జోషి , సోమ్ ప్రకాష్ , రామేశ్వర్ తెలీ, సుబ్రత్ పాథక్, దేబశ్రీ చౌదరిరీటా, బహుగుణ జోషి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ తార కంగనా రనౌత్, బీజేపీ సీనియర్ ఎల్‌కే అద్వానీ తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
- బిమ్స్‌టెక్ దేశాధినేతలు.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియంట్, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. థాయ్‌లాండ్‌కు ప్రత్యేక రాయబారి గ్రిసాడ బూన్‌రాక్ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే కిర్గిజ్ అధ్యక్షుడు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ సూరోన్‌బే జీన్‌బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment