సోమవారం ప్రమాణస్వీకారం అనంతరం కొత్త ఎమ్మెల్సీలను అభినందిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి ఇటీవల ఎన్నికైన ఏడుగురు కొత్త సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజ్ హసన్ ఎఫెండి... ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎ.నర్సిరెడ్డి, కూర రఘోత్తంరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment