MLCs sworn in
-
ఎమ్మెల్సీలుగా జకియా, సురేష్ ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జకియా ఖానమ్, పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్) మంగళవారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తన చాంబర్లో ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా వారు పదవీ స్వీకారం చేశారు. దీంతో మండలిలో వైఎస్సార్సీపీ బలం 10కు చేరుకుంది. ఈ సందర్భంగా లెజిస్లేచర్ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, ఉపముఖ్యమంత్రులు షేక్ అంజాద్‌బాషా, పి.పుష్పశ్రీవాణి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, జోగి రమేష్, బి.అప్పలనాయుడు, బూడి ముత్యాల నాయుడు, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీల పదవికి ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీని నమ్ముకున్న వారిని కచ్చితంగా గౌరవిస్తామనే సంకేతాన్ని ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో అన్నారు. దేశ చరిత్రలోనే ఒక ముస్లిం మైనారిటీ మహిళను తొలిసారి శాసనమండలికి పంపిన ఘనత వైఎస్ జగన్‌దే అన్నారు. అలాగే, తొలి నుంచీ పార్టీని వెన్నంటి ఉన్న పెనుమత్స కుటుంబం నుంచి సురేష్‌కు సముచిత స్థానం ఇచ్చారన్నారు. మైనారిటీ మహిళలు రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో జకియా ఖానమ్‌ను ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాష అన్నారు. మైనారిటీ మహిళకు వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పించారని మరో ఉపముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి ప్రశంసించారు. తనను ఎమ్మెల్సీగా చేసినందుకు తాము వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటానని జకియాఖానమ్ అన్నారు. -
ఏడుగురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి ఇటీవల ఎన్నికైన ఏడుగురు కొత్త సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజ్ హసన్ ఎఫెండి... ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎ.నర్సిరెడ్డి, కూర రఘోత్తంరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి హాజరయ్యారు. -
పట్టభద్ర ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన ఇద్దరు ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్), రామచందర్‌రావు (బీజేపీ) సోమవారం ప్రమాణ స్వీకారంచేశారు. శాసనమండలి జూబ్లీహాలులో మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తొలుత గన్‌పార్కులోని అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మండలికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రెడ్డితో స్వామిగౌడ్,ఉదయం 11.33 గం టలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ‘టీఆర్ఎస్ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై, ఐనె తిక పొత్తులతో ప్రయత్నించాయి. కానీ, పట్టభద్రు లు టీఆర్ఎస్పై నమ్మకంతో నన్ను గెలిపిం చారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..’ అని రాజేశ్వర్‌రెడ్డి ఆ తర్వాత మీడియాతో అన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటానని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. పల్లా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, ఎంపీ జితేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం బంజారాహిల్స్‌లోని కళిం గ భవన్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సన్మానించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రామచందర్‌రావు వెంట బీజేపీఎల్పీ నేత లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వచ్చారు. రామచందర్‌రావు ఉద యం 10.45 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ‘నన్ను గెలిపించినవారి రుణం తీర్చుకుంటా. నిరుద్యోగుల అంశాలను మండలిలో ప్రస్తావిస్తా. ప్రజలపక్షాన పోరాడుతా..’ అని పేర్కొన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలసి గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.