సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల(మార్చి)12న దీనికి సంబంధించిన నోటిషికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 19 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 20న నామినేషన్ల పరిశీస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ఏప్రిల్ 13వ తేదీ రోజు వరకు ఈ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నిక జరుగుతుంది. టీఆర్‌ఎస్ తరపున ఎన్నికైన భూపతి రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. దీంతో ఆయనపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అనర్హతపై భూపతి రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. చైర్మన్ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. దీంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment