bhupathi reddy
-
వైద్యుడి నుంచి.. శాసన సభ్యుడి వరకు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్థోపెడిక్ సర్జన్‌గా మంచి పేరు తెచ్చుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా పనిచేశారు. ప్రజా దవా ఖానా పేరిట 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసిన భూపతిరెడ్డి చాలామందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలో ప్రజలు ఆయనను అభిమానించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన ఆస్పత్రి తరపున పలు పోలియో క్యాంపులు నిర్వహించారు. మరోవైపు 2004 నుంచి 2009 వరకు ‘క్లియర్ సొసైటీ’(చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అండ్ రీహాబిటేషన్) అనే సంస్థను ఉమ్మడి జిల్లాలో నిర్వహించి దీనిద్వారా 1,500 మందికి పైగా చిన్నారులను పని మాన్పించి బడికి పంపేలా చేశారు. ఈ క్లియర్ సొసైటీలో పలువురు విద్యావంతులను భాగస్వామ్యం చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్‌పూర్‌కు చెందిన భూపతిరెడ్డి తల్లిదండ్రులు రాజారెడ్డి, లక్ష్మి. భూపతిరెడ్డి 1988లో గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. 1993లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంఎస్(ఆర్థో) పూర్తి చేశారు. తర్వాత ఏడాది పాటు కోయంబత్తూర్ మెడికల్ కళాశాలలో శిక్షణ తీసుకున్నారు. తదుపరి నిజామాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. పలువురికి ఉచిత సేవలు అందించిన నేపథ్యంలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 2001లో బీఆర్ఎస్లో వ్యవస్థాపక సభ్యుడిగా చేరి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులతో కలిసి జేఏసీలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహారశైలితో ఇమడలేక పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్‌లో చేరి 2018లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత ఐదేళ్లుగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చా రు. గతేడాది నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మంచిప్ప ముంపు బాధితులతో కలిసి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి విస్తృత పోరాటం చేశారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లక్ష ఎకరాలకు నీరందించడమే లక్ష్యం! నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గంలో పాత డిజైన్ మేరకే(ప్రాణహిత–చేవెళ్ల) లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తా. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నిర్దేశించుకున్న మేరకు టీఎంసీ నీటితో మంచిప్ప, కొండెం చెరువు జలాశయాన్ని నిర్మిస్తాం. దీంతో ఆయకట్టు తగ్గదు. 82వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. పైగా తొమ్మిది గ్రామాలకు, వేలాది ఎకరాల రైతుల భూములకు ముంపు ముప్పు తప్పుతుంది. – డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్యే ఇవి చదవండి: చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..? -
బీజేపీ వైపు భూపతిరెడ్డి చూపు?!
ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు.. కానీ, రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గులాబీ పార్టీలో రగులుతున్న అసంతృప్త జ్వాలలతో సమీకరణాలు మారి పోతున్నాయి. కేడర్ ‘కారు’ దిగి కాషాయ జెండా పడుతుండడంతో కమలంలో జోష్ కనిపిస్తోంది. అదే ఊపుతో ఇతర అసమ్మతి నేతలకు వల విసురుతున్న బీజేపీ నాయకత్వం.. కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులకు సైతం గాలం వేస్తోంది! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారతున్నాయి. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ, ఇక్కడ రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారి పోతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కారు దిగి, కమలం గూటికి చేరడం చర్చనీయాంశమైంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఒకరిద్దరు బీజేపీ వైపు చూస్తుండటంతో మూడు ప్రధాన పార్టీల్లో అంతర్గత చర్చకు దారి తీస్తోంది. టీఆర్ఎస్లోని అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ.. ఇటు కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకత్వంపైనా దృష్టి సారించింది. రూరల్ నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. పట్టు కోసం బీజేపీ ఆరాటం.. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇన్‌చార్జీగా ఉన్న కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు తరచూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లగలిగారు. తీరా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన ‘కారెక్కడం’తో చేరడంతో ఇక్కడ బీజేపీకి నాయకత్వ సమస్య తలెత్తింది. చెప్పుకోదగిన నియోజకవర్గ స్థాయి నాయకులు లేకుండా పోయారు. ఇక్కడ కమల దళానికి కేడర్ ఉన్నప్పటికీ వారిని నడిపించే నేతలు లేక పోవడంతో చాలా వరకు బీజేపీ కేడర్ సైలెంట్ అయిపోయింది. (చదవండి: టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి గులాబీ నేతలు!) ఇక ఇప్పుడు ఈ నియోజక వర్గంపై దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం.. పట్టు సాధించేందుకు పావులు కదుపుతోంది. అధికార టీఆర్ఎస్లో రగులుతున్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే డిచ్పల్లికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు బీజేపీలో చేరగా, మోపాల్‌తో పాటు మరో రెండు మండలాలకు చెందిన అసంతృప్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మొత్తానికి రూరల్ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీ వైపు భూపతిరెడ్డి చూపు? మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్‌కు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా నాయకత్వ సమస్యను అధిగమించవచ్చని బీజేపీ భావిస్తోంది. పార్టీ జిల్లా ముఖ్య నాయకత్వం భూపతిరెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. భూపతిరెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో ఉన్న ఆయనకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అనుచర వర్గం ఉంది. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గత ఎమ్మెల్యే ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరి, పోటీ చేశారు. దీంతో ఫిరాయింపుల చట్టం కింద ఆయన ఎమ్మెల్సీ పదవి పోయింది. అప్పటి నుంచి తన వైద్య వృత్తిని కొనసాగిస్తూనే అనుచర వర్గానికి అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ఎన్నికలు లేని ఈ సమయంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల(మార్చి)12న దీనికి సంబంధించిన నోటిషికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 19 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 20న నామినేషన్ల పరిశీస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఏప్రిల్ 13వ తేదీ రోజు వరకు ఈ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నిక జరుగుతుంది. టీఆర్ఎస్ తరపున ఎన్నికైన భూపతి రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. దీంతో ఆయనపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అనర్హతపై భూపతి రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. చైర్మన్ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. దీంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. -
ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే
సాక్షి, హైదరాబాద్ : అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఎన్నికై, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. మండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎటువంటి తప్పు లేదని తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేసింది. అలాగే అనర్హత వేటుకు ఆస్కారం కల్పిస్తున్న రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న 8వ పేరాను కూడా సమర్థించింది. మండలి చైర్మన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ భూపతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. మండలి చైర్మన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ భూపతి రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 10వ షెడ్యూల్లోని 8వ పేరా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్న భూపతిరెడ్డి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు కల్పిస్తున్న ఈ పేరా రాజ్యాంగానికి లోబడే ఉందని తెలిపింది. మండలి చైర్మన్ రాజ్యాంగానికి లోబడే భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేశారని, ఇందులో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని వివరించారు. -
భూపతిరెడ్డి కాంగ్రెస్ వ్యక్తే
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడానికి సంబంధించిన రికార్డులు, వీడియోలను శాసన మండలి హైకోర్టుకు నివేదించింది. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనానికి వీటిని మండలి తరఫు న్యాయవాది అందజేశారు. మండలి చైర్మన్ తమపై ఏకపక్షంగా అనర్హత వేటు వేశారని పేర్కొంటూ భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డి, ఎస్.రాములు నాయక్ వేరువేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలు గురువారం ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. భూపతిరెడ్డిని టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా పనిచేయడం వల్లే ఆయనను ఎమ్మెల్సీగా అనర్హుడిని చేస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని మండలి తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదించారు. భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెబుతున్నారని, మీ వద్ద ఉన్న ఆధారాల గురించి చెప్పాలని ధర్మాసనం కోరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి భూపతిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారని, ఈ విషయాన్ని భూపతిరెడ్డే స్వయంగా తన కౌంటర్ వ్యాజ్యంలో పేర్కొన్నారని రామచంద్రరావు బదులిచ్చారు. ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను భూపతిరెడ్డి కలిశారని, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారని, పోస్టర్లు కూడా ఉన్నాయని, పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఏనాడూ వాటిని భూపతిరెడ్డి మీడియా సమావేశాల్లో ఖండించలేదన్నారు. భూపతిరెడ్డి తన వ్యాజ్యంలో రాజ్యాంగంలోని 8వ పేరాను ప్రశ్నించడంపై కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సభ్యుల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనమండలి చైర్మన్‌కు ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన ఉదహరించారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇప్పటివరకూ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 6,7 పేరాలపై రాజ్యాంగ ధర్మాసనాలు సమీక్షించాయని, ఇప్పుడే తొలిసారి అదే షెడ్యూల్లోని పేరా 8ని సవాల్ చేయడం జరిగిందని గుర్తు చేసింది. పేరా 8కి ఉన్న రాజ్యాంగబద్ధతపై లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలని, దీనిపై లోతుగా అధ్యయనం చేసి 10వ తేదీన జరిగే విచారణ సమయంలో చెప్పాలని కేంద్రం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్‌ల కేసులపై శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. -
భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డిపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ బుధవారం నిర్ణయం ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే. దీనిపై టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసిన మండలి చైర్మన్ బుధవారం నిర్ణయం ప్రకటించారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2015లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్షన్ వేటు పడింది. తీర్మానం.. భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏడాది క్రితం తీర్మానం చేశారు. 2017 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చేసిన తీర్మానాన్ని పార్టీ జిల్లా ఇన్చార్జి తుల ఉమ ద్వారా సీఎం కేసీఆర్‌కు నివేదించారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న భూపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరి.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే. తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్షన్ వేటు పడటం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అనర్హతపై కోర్టుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యులుగా తమను అనర్హులను చేస్తూ చైర్మన్ స్వామిగౌడ్ జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలు వెల్లడించారు. స్వామిగౌడ్ నిర్ణయం అనంతరం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తమపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యయుతం కాదని, ఇది చీకటి రోజని పేర్కొన్నారు. గిరిజన హక్కుల గురించి మాట్లాడినందుకే... నన్ను డిస్క్వాలిఫై చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గాంధీతో పోల్చినందుకు నాకు అనర్హత గిఫ్ట్ ఇచ్చారు. సీఎం ఆఫీస్ డైరెక్షన్లోనే స్వామిగౌడ్ మాపై నిర్ణయం తీసుకున్నారు. నేను గవర్నర్ కోటాలో ఎన్నికయ్యా. ఏకపక్షంగా నన్ను అనర్హుడిగా ప్రకటించారు. ఫారూఖ్ హుస్సేన్ కూడా గవర్నర్ కోటాలోనే వచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోలేదు కానీ నా గురించి బులెటిన్ ఇచ్చారు. టీఆర్ఎస్ 88 స్థానాలు గెలిచినా సీఎం సెంచరీ కావాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. ప్రజలు పాలిం చాలని అధికారం ఇస్తే కేసీఆర్ ప్రతిపక్ష నాయకులను లేకుండా చేస్తున్నారు. గిరిజనుల హక్కుల గురించి నేను మాట్లాడినందుకు నన్ను డిస్క్వాలిఫై చేశారు. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తా. కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైన తర్వాత మేము కాంగ్రెస్ ఎమ్మెల్సీలం ఎలా అవుతామో వారికే తెలియాలి. – రాములు నాయక్ చైర్మన్ అధికారాలు తొలగించాలి... మమ్మల్ని అనర్హులను చేసినట్లు మీడియా ద్వారానే తెలిసింది. చట్టాన్ని అవహేళన చేస్తూ మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. కాంగ్రెస్‌పక్షం టీఆర్ఎస్లో విలీనమైనప్పుడు మేము పార్టీ మారినట్లు ఎలా అవుతుంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి. చైర్మన్లకు ఉన్న అధికారాలు తొలగించి ఒక కమిటీకి అప్పగించాలి. – యాదవరెడ్డి ఏ పార్టీ గుర్తుపై గెలవకున్నా అనర్హతా? మండలి చైర్మన్ నిర్ణయం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏ పార్టీ గుర్తుపైనా గెలవలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో విలీనమైనట్లు గెజిట్ విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేస్తారు? కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఈ అంశంపె కోర్టుకు వెళ్తా. – భూపతిరెడ్డి -
కోర్టుకెళతా.. న్యాయపోరాటం చేస్తా
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో తనపై శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ నేత భూపతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోనే చీకటి రోజు అని, ముగ్గురి మీద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించడం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలను అనర్హలుగా మండలి చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నేను ఏ పార్టీ గుర్తు మీద గెలువలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసలో విలీనం అయినట్లు గెజిట్ కూడా విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది. ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేశారు? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిరాయింపు కేసు వేశాం. కానీ, దానిపై చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నుకుంటేనే కదా మండలి చైర్మన్ అయ్యారు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది. ఈ అంశంపై కోర్టుకు వెళతా.. న్యాయపోరాటం చేస్తా’ అని అన్నారు. -
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వరుసగా వలసలు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లోని అసంతృప్తి వ్యవహారాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల తరుణంలో పలువురు చట్టసభల సభ్యులు, నియోజకవర్గ స్థాయి నేతలు పార్టీకి దూరమవుతున్న తీరును పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పార్టీకి దూరమైన వారిని మినహాయిస్తూ.. ఇతర నేతలు వేరే పార్టీలో చేరడానికి గల కారణాలను విశ్లేషిస్తోంది. కచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే పరిస్థితుల్లోనూ పలువురు నేతలు పార్టీ వీడుతుండడానికి కారణాలు ఏమిటనే కోణంలో వివరాలను సేకరిస్తోంది. రాష్ట్రంలోని పలువురు టీఆర్ఎస్ ముఖ్యులు శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వీరిలో ఉన్నారు. కఠిన వైఖరే... టీఆర్ఎస్లోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి విషయంలో కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అందరికీ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పినా కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం చేస్తున్న సమాచారం అధిష్టానానికి చేరింది. ఇలాంటివారిని ముందుగానే గుర్తించి సస్పెండ్ చేస్తోంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నర్సారెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఇదే తరహాలో ఎమ్మెల్సీ రాములునాయక్‌ను సైతం గతంలో సస్పెండ్ చేసింది. ఇలాంటి నేతలు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తోంది. నియోజకవర్గాల వారీగా పరిశీలించి ఇలాంటి నేతల జాబితా రూపొందిస్తోంది. పార్టీకి నష్టం చేస్తున్న నేతలపై చర్యల విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేచిచూసే ధోరణితోనే ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వరకు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలు సంగతి ఎలా ఉన్నా ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పలువురు నేతలు పార్టీకి దూరమవుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రానివారితోపాటు పలువురు నేతలు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లాలోనూ కీలక నేతలు టీఆర్ఎస్ను వీడారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు నారాయణఖేడ్ టికెట్ విషయంలో ఎమ్మెల్సీ రాములునాయక్‌ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. వీరిద్దరూ శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అంధోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ టీఆర్ఎస్ను వీడి ఇదే సెగ్మెం ట్లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరారు. పరకాల అసెంబ్లీ స్థానంలో సురేఖ ప్రచారం మొదలుపెట్టారు. పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు సెగ్మెంట్లలో వీరి ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన జువ్వాడి నర్సింగరావు సోదరులు కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో కోరుట్ల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నర్సింగరావు రెండోస్థానంలో నిలిచారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు వారసులుగా కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉండేలా వీరు ప్రభావం చూపుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్ కాంగ్రెస్‌లో చేరారు. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి 3 రోజుల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అబ్బయ్య గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున ఇల్లందులో పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి రంగారెడ్డిలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. రత్నం గత ఎన్నికలలో చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నారాయణపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కె.శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. -
‘తిట్టిన వాళ్లే కేసీఆర్ క్యాబినేట్లో ఉన్నారు’
సాక్షి, ఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు అవమానాలు, అన్యాయాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నానని వెల్లడించారు. పదవులు తనకు ముఖ్యం కాదన్నారు. అనర్హత వేటు వేసినా తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. 14 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీని నిర్మించామని, కానీ పార్టీని వీడిపోవాల్సి వస్తోందని అన్నారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో పూర్తిగా కేసీఆర్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల్లో ఇంకా న్యాయం జరగలేదని అన్నారు. రైతు బంధు పథకం వల్ల అసలైన రైతులకు న్యాయం జరగలేదని, కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదని చెప్పారు. సరైన గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ కేసీఆర్ అలా చేయలేదని చెప్పారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణాగా మార్చివేశారని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నారని ధ్వజమెత్తారు. ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట తప్పారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణత్యాగం చేస్తే 400 మందిని కూడా ఆదుకోలేదని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టిన వాళ్లే కేసీఆర్ క్యాబినేట్లో ఉన్నారని, నిజాయతీగా ఉండి పార్టీకి సేవ చేసిన వాళ్లను బయటికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ బడుగు బలహీనవర్గాలకు చెందిన పార్టీ, ఇవ్వన్నీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమౌతుందన్న నమ్మకం ఉందన్నారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలన్న కోరికని ఆయన వెల్లడించారు. బంగారు కుటుంబమే బంగారు తెలంగాణ కాలే: విద్యాసాగర్ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో తాము భాగస్వాములు అయ్యామని, కానీ ఆశించిన రీతిలో టీఆర్ఎస్ పనిచేయడం లేదని ప్రొఫెసర్ విద్యాసాగర్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం అయింది కానీ బంగారు తెలంగాణ కాలేదని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులను టీఆర్ఎస్ పట్టించుకోవడంలేదని, అసమర్థులకు టిక్కెట్లు కేటాయించడం వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. -
భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం?
-
ఏం ముఖం పెట్టుకుని ఎన్నికలకు పోతావ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నిజామాబాద్ నుంచి ప్రారంభమైందని, పతనం కూడా ఇక్కడి నుంచేనని హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరును తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్ రూరల్ తాజామాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పైనా విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ వెంట ఉన్న గుప్పెడు మంది నేతల్లో తాను ఒకడినని, తన లాంటి అనేక మందికి కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. రూరల్ నుంచే పోటీ.. ఈ ఎన్నికల్లో తాను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేర్చుకున్న 25 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశాకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. టీఆర్ఎస్ జిల్లాలో పూర్తిగా అస్తవ్య స్తంగా తయారైందని, ఎంపీ కవిత పీఏకున్న విలువ పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు విమర్శించారు. -
‘టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేయను’
నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం వినిపించారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై భూపతి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేస్తానని కుండబద్దలు కొట్టి చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌ను ఓడిస్తానని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని, టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేయనని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తా..ఏ పార్టీ అనేది త్వరలో చెబుతా, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపారు. అలా చేయకపోతే రాజీనామా చేయనన్నారు. తాను తప్పు చేస్తే ఎందుకు సస్పెండ్ చేయరని ప్రశ్నించారు. క్షమాపణ ఎందుకు చెప్పరు.. పొమ్మన లేక పొగ పెడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ముందస్తు ఎన్నికలకు పోతుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పతనం నిజామాబాద్ నుంచే మొదలవుతుందని శాపనార్థాలు పెట్టారు. కేబినేట్లో 70 శాతం మంది కేసీఆర్‌ను తిట్టిన వారే ఉన్నారని వెల్లడించారు. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులను పథకం ప్రకారం టీఆర్ఎస్ పక్కన పెడుతోందని, టీఆర్ఎస్ చెప్పిందే వినాలి..లేకపోతే ద్రోహులు అనే ముద్ర వేసే పద్ధతి అవలంబిస్తున్నారని అన్నారు. నీళ్లు, నిథులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆ మూడూ జరగడం లేదని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులు జూన్ రెండున నివాళులు అర్పిస్తుంటే బాధ కలుగుతోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన ఓ యువకునికి కేసీఆర్ ఇంతవరకూ నష్టపరిహారం మంజూరు చేయలేదని వెల్లడించారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని అమరవీరులు, విద్యార్థులు, మేథావులు, కళాకారులు, జనాలు ఆశించారో అవేమీ నెరవేరలేదని భూపతిరెడ్డి విమర్శించారు. -
ఇక జిల్లాలవారీగా పార్టీ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కోసం ప్రజాక్షేత్రంలో సర్వేలు చేస్తూనే టీఆర్ఎస్లో అంతర్గత అంశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి కేంద్రీకరించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ పరిస్థితితోపాటు అభ్యర్థుల ప్రభావాన్ని, పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. వివిధ సర్వే సంస్థల ద్వారా చేపట్టిన సర్వేలు, పోలీసు నిఘా వర్గాలు, ఇతర మార్గాల ద్వారా నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నారు. పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి అనుకూలంగానే క్షేత్రస్థాయిలో ఓటర్లు ఉన్నట్లు పలు నివేదికలు, సర్వేలు వస్తున్నాయి. అయితే చాలా నియోజకవర్గాల్లో, అంటే దాదాపుగా రాష్ట్రంలోని మూడొంతుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పార్టీ శ్రేణులు, ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్లు వస్తున్న నివేదికలను సీఎం ప్రత్యేకంగా మదింపు చేస్తున్నారు. దీనికోసం ముందుగా పార్టీలోని పరిస్థితులపై నివేదికలను జిల్లా మంత్రులు, ముఖ్యుల ద్వారా తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయంగా ఉన్న ఎమ్మెల్యేలు, కొంత కష్టపడితే గెలుస్తారనే విశ్వాసమున్న నియోజకవర్గాల్లో ముందుగా దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తే గెలుపు సులభం అవుతుందనే విశ్వాసమున్న నియోజకవర్గాల్లో కొంత కఠినంగా వ్యవహరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికోసం పార్టీ మండలస్థాయి నేతల బలాబలాలు, శక్తి సామర్థ్యాలతోపాటు భవిష్యత్తు యోచనను జిల్లా యంత్రాంగం ద్వారా సేకరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ను ఆశిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను నష్టపరిచే చర్యలకు టీఆర్ఎస్ నేతలే దిగుతున్నారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో స్థానికంగా పదవులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న నేతలతో చర్చించి, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతలను జిల్లా నేతలకు అప్పగించనున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి, స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారితో జిల్లా మంత్రులు, ఇతర ముఖ్యులు చర్చించాలనే యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పించలేని వారికి మరో మార్గంలో రాజకీయంగా స్థానాన్ని కల్పిస్తామని హామీలతో రానున్న ఎన్నికల్లో వారితో ఇబ్బందులు రాకుండా చూడాలని అనుకుంటున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే టికెట్ తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒప్పుకోని నాయకులను, ఇంకా ఏవైనా ఇతర మార్గాల్లో పార్టీకి నష్టం కలిగిస్తారనే అంచనా ఉన్న నాయకులను పార్టీ నుంచి బయటకు పంపించడానికి కూడా వెనుకాడకూడదనే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. భూపతిరెడ్డి, డీఎస్‌పై వ్యూహం ఏమిటో...? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆర్. భూపతిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కె.కవిత, బి.బి.పాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆరు నెలల కిందట లేఖ రాశారు. అలాగే రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాజాగా లేఖ రాశారు. అయితే ఈ రెండు ఫిర్యాదులపైనా సీఎం కేసీఆర్ మనోగతం పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఈ విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. -
ఎమ్మెల్సీ వెంట వెళ్లేదెవరో.!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి సస్పెన్షన్ వ్యవహారం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం విదితమే. ఈ లేఖను జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తుల ఉమ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ మేరకు భూపతిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తే టీఆర్ఎస్ను విడిచి వెళ్లేవారు ఎవరుంటారనే అంశంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రధాన అనుచరులు ఎవరు., ఏ మేరకు ప్రభావం పడుతుంది అనే అంశాలపై ఇంటలిజెన్స్ అ ధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. కాగా సస్పెన్షన్‌పై జిల్లా ప్రజాప్రతినిధుల నిర్ణయం నేపథ్యంలో భూపతిరెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. సీఎం నిర్ణయంపై ఉత్కంఠ భూపతిరెడ్డి సస్పెన్షన్‌కు సంబంధించి అధినేత కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చి న లేఖ మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తు న్నట్లు సీఎం ప్రకటిస్తారా? లేక పార్టీ క్రమశి క్షణ సంఘానికి సిఫార్సు చేస్తారా అనే అం శంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గు రువారం సీఎం కేసీఆర్ నిర్ణయం వెలువడుతుందని భావించినప్పటికీ ప్రకటన రాలేదు. దీంతో ఈ ఉత్కంఠ రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తరలివెళ్లిన అనుచరులు.. విషయం తెలుసుకున్న భూపతిరెడ్డి అనుచరవర్గం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు భూపతిరెడ్డిని కలిశారు. డీఎస్, బాజిరెడ్డిల మధ్య కూడా ఆధిపత్య పోరు.. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డికి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్యే కాకుండా, రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్తోనూ ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం విదితమే. డీఎస్ ప్రతిపాదించిన శ్మశాన వాటికల నిర్మాణం పనులకు బాజిరెడ్డి అనుచరవర్గం ఎంపీపీలు తీర్మానం చేయకుండా అడ్డుకున్న విషయం ఇటీవల ఈ నేతల మధ్య ఆధిపత్యపోరును రచ్చకీడ్చింది. గతంలో బాజిరెడ్డి ప్రతిపాదించిన ఉపాధి హామీ పనులను తీర్మానం చేయకుండా డీఎస్ అనుచర ఎం పీపీ అడ్డుకున్న విషయం విదితమే. ఇప్పుడు భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో డీఎస్ వర్గీయుల వ్యవహార శైలి ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ తప్పినందుకే.. ♦ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలని తీర్మానించాం ♦ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు (నిజామాబాద్ అర్బన్): క్రమశిక్షణ తప్పినందుకే ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలని ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులందరం తీర్మానం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన పదవిని, గౌరవాన్ని కళ్లకు అద్దుకొని కాపాడుకోవాలని.. ఆ విధంగా భూపతిరెడ్డి నడుచుకోలేదన్నారు. ఎంత ఎదిగితే అంత ఒదగాలని పెద్దలు చెప్పారని అన్న మంత్రి మితిమీరితే ఎం తటివారైన సరే వారిపై చర్యలు తప్పవన్నారు. ఒకసారి పొరపాటు జరిగితే దా నిని సరిదిద్దుకోవలే తప్ప మళ్లీ మళ్లీ చేయడం ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది వస్తుందన్నారు. భూపతిరెడ్డికి సీఎంతో పాటు తాను, ఎం పీ, ఎమ్మెల్యేందరూ పిలిపించుకుని చెప్పినప్పటికీ ఆయన వైఖరి మారలేదన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యేకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడం, వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల అక్కడ గ్రూపు లు ఏర్పడ్డాయన్నారు. ఇది సంప్రదాయం కాదన్నారు. పార్టీ సూచనలు పాటించకుండా పదవులు ఉన్నాయని ఆహంకారంతో భిన్నంగా, విరుద్ధంగా వెళ్లిన వారు ఎవరైనా సరే పార్టీకి, ప్రభుత్వానికి అతీతులు కారని మంత్రి స్పష్టం చేశారు. -
ఉత్తమ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్
నిజామాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం నిజామాబాద్‌లో భూపతిరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందుకే ఉత్తమ్‌కుమార్ పంటనష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని భూపతిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన
సిరికొండ మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనానికి స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డా.భూపతి రెడ్డి, వీజీ గౌడ్ లు పాల్గొన్నారు. -
నిజామాబాద్ ఎమ్మెల్సీగా భూపతిరెడ్డి ఏకగ్రీవం
నిజామాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఇప్పటికే వరంగల్, మెదక్ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో రెండు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు కసరత్తు చేస్తోంది. మెదక్, నిజామాబాద్‌లో గట్టి పోటీ ఇస్తారని భావించిన కాంగ్రెస్ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రెండు స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు స్థానాలను గెలుచుకోవడం దాదాపుగా ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి జగదీష్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.