
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఎన్డీయేతర పక్షాలు కీలక సమావేశం నిర్వహించాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో ‘సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసి’ పేరుతో శుక్రవారం విపక్ష నేతలు భేటీ అయ్యారు. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు, జాతీయ నేతలు శరద్ పవార్, డీ రాజా, శరద్ యాదవ్, డీఎంకే నాయకురాలు కనిమొళితో సహా పలువురు నేతలు హాజరైయ్యారు.
సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. బడ్జెట్‌పై స్పందిస్తూ.. రైతులకు రోజుకు 17 రూపాయలు ప్రకటించి ప్రభుత్వం వారిని అవమానపరిచిందని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఈవీఎంలపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని.. ఈనెల 4న వాటిపై ఎన్నికల అధికారులను కలుస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని రాహుల్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment