
పశ్చిమగోదావరి, భీమవరం: దోపిడీ, లంచగొండితనం లేని రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫం„క్షన్ హాలులో శుక్రవారం ఆయన వివిధ వర్గాల వారితో మాట్లాడారు. యువతే జనసేనకు ఇంధనమని, దానికి స్థానిక నాయకుల అనుభవం తోడైతే రాష్ట్రంలో జనసేన అత్యంత బలపడుతుందని అన్నారు. రాష్ట్రాన్ని 40 ఏళ్లపాటు కాంగ్రెస్, 20 ఏళ్లు తెలుగుదేశం పార్టీలు పాలించాయని రాను న్న ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇవ్వాలని పన న్ కోరారు.
ప్రజలకు ఏదైనా మంచి చెప్పాలంటే సినిమాల్లో రెండున్నర గంటల సమయం చాలదని నిజజీవితంలో 20 ఏళ్లు పడుతుందని వివరించారు. అందుకు 25 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని వెల్లడించారు. మహిళలు, విద్యార్థినులకు భద్రత కల్పిస్తానని చెప్పారు. పవన్ చుట్టు చిన్న పిల్లలే ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, తాను రాజకీయాల్లోకి వచ్చింది భావితరాల కోసమే తప్ప దోపిడీదారుల కోసం కాదని వివరించారు. అనంతరం నరసాపురం, తణుకు, నిడదవోలు ప్రాంతాలకు చెందిన పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు జనసేన పార్టీలో చేరారు
Comments
Please login to add a commentAdd a comment