సీఎంగారు మాకూ జీవించే హక్కుంది: పవన్‌ కల్యాణ్‌ | Pawn Kalyan demands Bhimavaram Dumping Yard Will Be Changed To Outskirts | Sakshi
Sakshi News home page

సీఎంగారు మాకూ జీవించే హక్కుంది: పవన్‌ కల్యాణ్‌

Published Sat, Aug 11 2018 5:27 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawn Kalyan demands Bhimavaram Dumping Yard Will Be Changed To Outskirts - Sakshi

భీమవరంలో చెత్త డంపింగ్‌ యార్డును పరిశీలిస్తున్న పవన్‌ కల్యాణ్‌

సాక్షి, భీమవరం: ముఖ్యమంత్రి గారు మీ కొడుకుకే కాదు మాకు కూడా ఆరోగ్యం కల్పించడంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభ్యర్ధించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వారు జనావాసాలకు సమీపంగా, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలించారు.

అనంతరం డంపింగ్‌ యార్డ్‌ను ఇలా జనవాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన దుర్గంధం రావడమే కాక.. పందులు, దోమలు విజృంభించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేవలం ఆయన కొడుకు గురించే కాక రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సందర్భంగా డంపింగ్‌ యార్డ్‌ చుట్టు పక్కల ఉన్న పిల్లల చేత ‘ముఖ్యమంత్రి గారు మా అందరికి ఆరోగ్యం కల్పించండి’ అంటూ ప్రమాణం చేయించారు. తక్షణమే ఈ డంపింగ్‌ యార్డ్‌ను ఇక్కడ నుంచి తొలగించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement