
న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశభక్తి విషయంలో సరికొత్త నిర్వచనం ఇస్తున్న మోదీ ప్రభుత్వం, భిన్నత్వానికి తూట్లు పొడుస్తున్న వ్యక్తులను దేశభక్తులుగా గౌరవిస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా మాట్లాడారు. ‘ఈరోజు మనకు దేశభక్తి విషయంలో కొత్త నిర్వచనం ఇస్తున్నారు. అదే సమయంలో భిన్నత్వాన్ని పాటించని వ్యక్తులను దేశభక్తులుగా కీర్తిస్తున్నారు. పక్కా ప్రణాళికతో భారతదేశపు ఆత్మను అణచివేసేందుకు కుట్ర జరుగుతోంది. మోదీ ప్రభుత్వం అసమ్మతిని గౌరవించడానికీ, సమన్యాయ పాలన అందించేందుకు సిద్ధంగా లేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment