
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ప్రజలను మోసం చేయటానికి ఉపయోగపడిందని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో కోట్లు విలువ చేసే భూమిని లింగమనేని రమేష్! పవన్ కళ్యాణ్‌కు రూ.25 లక్షలకు ఇచ్చారని, తాము దానికన్నా మరో రూ.5 లక్షలు ఎక్కువగా ఇస్తాం పవన్ కళ్యాణ్ దాన్ని ఇస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 45కోట్ల రూపాయలు పెట్టి పవన్ ఇళ్లు కట్టించాడని ప్రచారం జరుగుతోందన్నారు.
దానికి చిరంజీవి ఒక్కడే వెళ్లాడని కూడా చెప్తున్నారని పేర్కొన్నారు. ‘పవన్ కళ్యాణ్ మీరు ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తారు.. మీరు అసలు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా’ అంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు విషయంలో.. విజయవాడ కాల్ మనీ విషయంలో.. పవన్, చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే దానిపైన పవన్ ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 ప్రజారాజ్యం ఓటమి తర్వాత పవన్ పార్టీ నుంచి పారిపోయారని, అప్పటి నుంచి ఆయన పారిపోతూనే ఉన్నారంటూ దుయ్యబట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాత్రమే పవన్ రంపచోడవరం వెళ్లారని, కానీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనేక సార్లు ఏజన్సీ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలపై పోరాటం చేశారని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలపై పోరాటం చేసింది జగన్ మాత్రమేనని నొక్కిఒక్కానించారు. పవన్ బాక్సైట్‌పై ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో లక్ష మందితో సభ నిర్వహించి బాక్సైట్ జోలికొస్తే ఊరుకోమని రామ్మోహన్ రెడ్డి ఎప్పుడో హెచ్చరించారని చెప్పారు. చంద్రబాబును మళ్లీ ఇప్పుడు అధికారంలోకి తేవటానికి పవన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment