
మాట్లాడుతున్న రాజమ్మ
శ్రీకాళహస్తి: నియోజకవర్గంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబం ఊసే లేకుం డా చేస్తామని దివంగత మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి సోదరి పేటారాజమ్మ అన్నారు. ఆమె బుధవారం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన వయస్సు అయిపోయిందని, తనకు రూ.2 కోట్లు ఇస్తే చంద్రబాబు, ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనని మున్సిపల్ చైర్మన్ చేస్తారని, నీవేమైనా చేసి తన చిరకాల వాంఛ తీర్చాలని తన సోదరుడు పేట రాధారెడ్డి కోరారని చెప్పారు. దీంతో తనకు ఉన్న ఒకటిన్నర ఎకరం పొలాన్ని అమ్మి తన తమ్ముడు పేట రాధారెడ్డిని మున్సిపల్ చైర్మన్ చేసేందుకు పాటుపడ్డామన్నారు. అయితే తన తమ్ముడు మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి, ఆయన భార్య బృందమ్మ, వారి తనయుడు బొజ్జల సుధీర్‌రెడ్డి కమీషన్లు ఇవ్వలేదన్న అక్కుసుతో నానా ఇబ్బందులు పెట్టారన్నారు. అందుకే వారి నాశనం చూసే వరకు నిద్రపోనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment