టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం.. హైకోర్టులో విచారణ | Petition Against CLP Merging in TRSLP in High Court | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం.. హైకోర్టులో విచారణ

Published Tue, Jun 11 2019 11:30 AM | Last Updated on Tue, Jun 11 2019 4:07 PM

Petition Against CLP Merging in TRSLP in High Court  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో శాసనసభ స్పీకర్, కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేశారు. గతంలో దాఖలు చేసిన ఇదే తరహా కేసు విచారణ కూడా ఇవాళ ఉందని చెప్పడంతో రెండింటినీ కలిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు 12 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement