భువనేశ్వర్ : సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలోనూ ఈసారి కమలం విరబూస్తుందని..బీజేపీ విజయభేరి మోగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. సమగ్రాభివృద్ధికి పాటుపడే ప్రభుత్వం కావాలో, అవినీతి సర్కార్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. గిరిజన ప్రాబల్య సుందర్‌గఢ్‌లో ప్రధాని మోదీ శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
జాతీయ భద్రత, సత్వర అభివృద్ధి కోసం కేంద్రంలో పటిష్ట, నిర్ణయాత్మక ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్నారు. ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రానున్న ఎన్కిలు ఒడిషాతో పాటు దేశ భవిష్యత్‌కు కీలకమైనవని చెప్పుకొచ్చారు. బీజేపీ వ్యవస్ధాపక దినం సందర్భంగా ప్రధాని కార్యకర్తల కృషిపై ప్రశంసలు గుప్పించారు. పార్టీని కార్యకర్తలు చెమటోడ్చి ఈ స్ధాయికి తీసుకువచ్చారని, తమకు వారసత్వ మూలాలు కానీ, ధనం కానీ లేవని చెప్పారు. కార్యకర్తల కృషి, నిర్మాణ దక్షతతోనే తమ పార్టీ ఎదిగిందన్నారు. కాగా ఒడిశాలో నాలుగు విడతల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment