సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్,రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు బీజేపీ సెంట్రల్ కమిటీ సభ్యులతో భేటీ అయి, సమాచలోచనల అనంతరం ఆయా రాష్ట్రాల అభ్యర్థుల లిస్టును మీడియాకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 175 మంది, ఎంపీ జాబితాలో 23 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ.. మిగతా రెండు లోక్‌సభ సీట్లలో పోటీపై ఎటూ తేల్చలేదు. వీటితోపాటు ఒడిషా 5, మహారాష్ట్ర 6, మేఘాలయ 2 స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా:
లోక్‌సభ నియోజకవర్గం | అభ్యర్థి |
అరకు | కేవీవీ సత్యనరాయణ రెడ్డి |
శ్రీకాకుళం | పెర్ల సాంబమూర్తి |
విజయనగరం | పి. సన్యాసి రాజు |
అనకాపల్లి | డా. గాంధీ వెంకట నారాయణ |
కాకినాడ | యల్లా వెంకట రామ్మోహన రావ్ (దొరబాబు) |
అమలాపురం (ఎస్సీ) | అయ్యాజీవేమ మనేపల్లి |
రాజమండ్రి | సత్య గోపీనాథ్ దాస్పరవాస్థు |
నర్సాపురం | పైడికొండ మాణిక్యాల రావ్ |
ఏలూరు | చిన్నం రాంకోటయ్య |
మచిలీపట్నం | గుడివాక రామాంజనేయులు |
విజయవాడ | దిలీప్ కుమార్ కిలారు |
గుంటూరు | వల్లూరు జయప్రకాశ్ నారాయణ |
బాపట్ల (ఎస్సీ) | డా. చల్లగాలి కిషోర్ కుమార్ |
ఒంగోల్ | తోగుంట శ్రీనివాస్ |
నంద్యాల | డా. ఆదినారాయణ ఇంటి |
కర్నూల్ | డా. పీవీ పార్థసారథి |
అనంతపూర్ | హంస దేవినేని |
హిందూపూర్ | పోగల వెంకట పార్థసారథి |
కడప | సింగరెడ్డి రాంచంద్రారెడ్డి |
నెల్లూర్ | సురేష్ రెడ్డి సన్నపరెడ్డి |
తిరుపతి (ఎస్సీ) | బొమ్మి శ్రీహరిరావ్ |
రాజంపేట్ | పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి |
చిత్తూర్ (ఎస్సీ) | జయరాం దుగ్గని |
Comments
Please login to add a commentAdd a comment