
కొరిపల్లి జయలక్ష్మి ,చింతల రాజేశ్వరి
పశ్చిమగోదావరి , ఉంగుటూరు: గతంలో భర్తల మధ్య, ఇప్పుడు భార్యల మధ్య పోటీ ఉంగుటూరు మండలంలో ఆసక్తికరంగా మారింది. మండల జెడ్పీటీసీ స్థానానికి ఈ పోటీ జరగనుంది. 2015లో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున చింతలవాసు, కాంగ్రెస్ పార్టీ తరఫున కొరిపల్లి శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చింతల వాసు గెలిచారు. ఇప్పడు అదే ఉంగుటూరు జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. కాగా కాంగ్రెసులోంచి కొరిపల్లి శ్రీను వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే వాసుబాబుకు మంచి నాయకుడిగా, అనుచరుడిగా పనిచేస్తున్నారు. దాంతో వైసీపీ తరఫున కొరిపల్లి శ్రీను భార్య కొరిపల్లి జయలక్ష్మిని పోటీలోకి దింపుతున్నారు. జయలక్ష్మికి మంత్రి వసంతకుమార్ హయాంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే జయలక్ష్మి మీదకు టీడీపీ తరఫున మాజీ జెడ్పీటీసీ చింతలవాసు భార్య చింతల రాజేశ్వరిని పోటీకి ఆ పార్టీ ఎంపికచేసింది. వారిద్దరిదీ కైకరం గ్రామం కావటం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment