
సాక్షి, కరీంనగర్ : రాజకీయ లభ్ధికోసమే బీజేపీ గాంధీ సంకల్పయాత్ర చేపట్టిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడు అంటూనే.. గాంధీ పేరుతో సంకల్ప యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. చంపిన వాళ్లను పూజించే బీజేపీ ఏ ముఖం పెట్టుకొని యాత్రలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా కార్మికులు చేస్తున్న ఆందోళనపై స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. మిడ్ మానేరు ప్రాజెక్టులో రిపేర్లు నడుస్తుండడంతో ఎల్లంపల్లి నుంచే నీరు వృధాగా పోతుందని, వెంటనే ఆ నీటిని దారి మళ్లించి చెరువులను, కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాబిన్నామవ్వడానికి బతుకమ్మ చీరలు తయారుచేసిన సిరిసిల్ల నేతన్నలకు డబ్బులు చెల్లించకపోవడమే నిదర్శనమని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment