కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మకయ్యాయని, వారికి అభ్యర్థులు దొరకడం లేదని మంత్రి కేటీఆర్ మాట్లాడటం గర్హనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాటికైనా ఉత్తర, దక్షిణ ధ్రువాలనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభ్యర్థులను భయాభ్రాంతులకు గురిచేయడం, డబ్బు సంచులతో ప్రలోభాలకు గురి చేయ డాన్ని చూస్తుంటే టీఆర్‌ఎస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో గెలువమనే అభద్రతా భావం నెలకొందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఢిల్లీలో బీజేపీతో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్న తీరుకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment