సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈసారి మోదీ భక్తులపై విరుచుకుపడ్డారు. డియర్ మోదీ భక్తులు అంటూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల వైఫల్యాన్ని రాహుల్ ఎత్తిచూపారు. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ 9860 కోట్లలో ఇప్పటివరకూ కేవలం ఏడు శాతం నిధులనే ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆరోపించారు. అభివృద్ధిలో చైనా మనల్ని దాటి ముందుకువెళుతుంటే ప్రధాని మోదీ కేవలం నినాదాలకే పరిమితమయ్యారని విమర్శించారు.
యువతకు ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏం చేయాలో మోదీ భక్తులు తమ గురువుకు సూచించాలని చురకలు అంటించారు. మోదీ ప్రభుత్వంపై వీలుచిక్కినప్పుడల్లా పదునైన విమర్శలతో ముందుకొస్తున్న రాహుల్ ఇటీవల పార్టీ వ్యవస్ధాపక దినోత్సవంలోనూ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. అసత్యాలు ప్రచారం చేస్తూ బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. ఓటమి ఎదురైనా కాంగ్రెస్ పార్టీ అసత్యాలకు దూరంగా ఉంటుందని రాహుల్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment