
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవ దీక్ష పేరుతో నిర్వహించిన ధర్నాలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కానీ గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మోదీ హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, టి. సుబ్బిరామిరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు పళ్లంరాజు, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, నాదెండ్ల మనోహర్, సాకే శైలజానాథ్, సి. రామచంద్రయ్య, సుంకర పద్మశ్రీ, గిడుగు రుద్రరాజు తదితరలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు సీపీఎం, సీపీఐ, ఆప్ ఇతర ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment