ప్లాన్‌ బీ’ తయారైందిలా.. | Rahul plan b | Sakshi
Sakshi News home page

ప్లాన్‌ బీ’ తయారైందిలా..

Published Wed, May 16 2018 1:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rahul plan b - Sakshi

న్యూఢిల్లీ: జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడకు కాంగ్రెస్‌ స్నేహహస్తం చాచడం ఆసక్తికర పరిణామం. దక్షిణాదిలో బీజేపీ పాగా వేయకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్‌ ఈ ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహానికి వేదికైంది మాత్రం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసమే. ఫలితాల సరళిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిసిన వెంటనే రాహుల్‌ ఇంట్లో పార్టీ అధినాయకత్వం లంచ్‌ సమావేశం నిర్వహించింది.

రాహుల్‌ సోదరి ప్రియాంక కూడా దీనికి హాజరయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ‘కింగ్‌ మేకర్‌’ దేవెగౌడకు చేరువకావాలని నిర్ణయించారు. తమతో చేతులు కలపాలని, సంకీర్ణ ప్రభుత్వానికి కుమారస్వామి నేతృత్వం వహించినా తమకేం అభ్యంతరం లేదని సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో ఫోన్‌ చేయించారు. ఈ ఆఫర్‌కు కుమారస్వామి అంగీకరించడం, ఆ వెంటనే గవర్నర్‌ను కలవడం చకచకా జరిగిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement