
సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కొట్టి పారేశారు. కమలదళంలో చేరనున్నట్లు తనపై కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ‘బీజేపీలో చేరాలంటూ నన్నెవరూ ఆహ్వానించలేదన్నది సుస్పష్టం. తిరువళ్లువర్(ప్రాచీన తమిళ కవి)పై జరిగినట్లే నాపై కూడా బీజేపీ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే, తిరువళ్లువర్ కానీ, నేను కానీ ఆ వలలో పడబోం’అన్నారు. హిందూ మున్నానీ నేతలు తిరువళ్లువర్ విగ్రహానికి కాషాయ రంగు వస్త్రం కప్పడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు నాపై బీజేపీ మనిషినంటూ ప్రచారం చేసేందుకు ప్రయత్నించాయి. కానీ, అది ఎంతమాత్రం నిజం కాదు’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment