Thiruvalluvar
-
నాపై ‘కాషాయం’ పులిమే ప్రయత్నం: రజినీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కొట్టి పారేశారు. కమలదళంలో చేరనున్నట్లు తనపై కాషాయ రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ‘బీజేపీలో చేరాలంటూ నన్నెవరూ ఆహ్వానించలేదన్నది సుస్పష్టం. తిరువళ్లువర్(ప్రాచీన తమిళ కవి)పై జరిగినట్లే నాపై కూడా బీజేపీ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే, తిరువళ్లువర్ కానీ, నేను కానీ ఆ వలలో పడబోం’అన్నారు. హిందూ మున్నానీ నేతలు తిరువళ్లువర్ విగ్రహానికి కాషాయ రంగు వస్త్రం కప్పడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు నాపై బీజేపీ మనిషినంటూ ప్రచారం చేసేందుకు ప్రయత్నించాయి. కానీ, అది ఎంతమాత్రం నిజం కాదు’అని అన్నారు. -
అన్నాడీఎంకే, పీఎంకే ఘర్షణ
తిరువళ్లూరు: జయను విడుదల చేయాలని చేస్తున్న నిరాహారదీక్షలో అన్నాడీఎంకే నేతల ప్రసంగంలో పీఎంకే నేత రాందాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆగ్రహించిన పీఎంకే నేతలు, అన్నాడీఎంకే నేతలతో స్వల్ప ఘర్షణ పడ్డారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో సమస్య సద్దుమణిగింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతంలో జయలలితను విడుదల చేయాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు నిరాహారదీక్షను ఉదయం 8 గంటల నుంచి నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా జయకు మద్దతుగా పలువు రు నేతలు ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో పీఎంకే అధ్యక్షుడు రాందాస్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు ఏకవచనంతో సంభోదించా రు. దీంతో ఆగ్రహం చెందిన పీఎంకే నేతలు అన్నాడీఎంకే నేతలు నిరాహారదీక్ష చేస్తున్న స్థలం వద్దకు చేరుకుని జయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరిని ఒకరు తోసుకుంటూ దాడులకు ప్రయత్నించడంతో పోలీసులకు ఇరు వర్గాలను శాంతింప చేయడం కష్టతరంగా మారింది. విషయాన్ని డీఎస్పీ చంద్రశేఖర్‌కు తెలపడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పీఎంకే నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు. పీఎంకే, అన్నాడీఎంకే నేతల మధ్య దాదాపు మూడు గంటల పాటు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. -
దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: ఆసుపత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేయడమే కాకుండా వైద్యులపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్యకేంద్రం డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. చెన్నై-తిరుపతి జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరువళ్లూరు సమీపం పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన రోడ్డు కాంట్రాక్టర్ కమలనాథన్(40) గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. శవపరీక్ష నిమిత్తం ఆయన మృతదేహాన్ని తిరువళ్లూ జిల్లా వైద్యకేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడకు పెద్ద ఎత్తున మృతుని బంధువులు చేరుకున్నారు. వైద్యులు, నర్సులు, కవరేజ్ చేస్తున్న మీడియా, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై వారు విచాక్షణారహింతగా దాడులు చేశారు. ఆసుపత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై వైద్యులు శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. చెనై,తిరుపతి జాతీయరహదారిపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ సెంథిల్ కుమార్ వైద్యులతో చర్చలు జరిపారు. వెద్యులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు, వైద్యశాల వద్ద పోలీసుల బందోబస్తును పెంచుతామని వారు హమీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.ఇది ఇలా వుండగా గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పోలీసుల బలాగాలను రప్పించారు. ఇదిలా ఉండగా కమలనాథన్ బంధువుల దాడిలో ఎస్.ఐలు కన్నన్, ఇరుడి కేశవన్, అన్నాదురై, ఇన్పెక్టర్ హరికృష్ణతో పాటు పలువురు గాయపడ్డారు. వీరిలో అన్నాదురై పరిస్థితి విషమంగా మారడంతో అతనిని చెన్నై వైద్యశాలకు తరలించారు.