సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల నేతలలో 90శాతం మందికి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వరని కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ‘తీగల కృష్ణారెడ్డికి ఈసారి టీఆర్‌ఎస్ టికెట్ కట్. ఇక జనగాంలో ఎర్రబెల్లి దయాకరరావు పోటీ చేస్తారు. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు, కడియం శ్రీహరిని ఈసారి పార్లమెంట్‌కు పోటీ చేయిస్తారు. కేటీఆర్‌కు ప్రమాదం అనుకున్న నేతలను కేసీఆర్ ఎంపీ టికెట్‌లు ఇస్తారు.
టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి లేనివాళ్లు కేసీఆర్, కేటీఆర్ మాత్రమే. నాగం జనార్దన్ రెడ్డి అంటే నాకు గౌరవం ఉంది. నాపై కేసులు పెట్టినప్పుడు నాగం...నాకు ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించిన వారంటే నాకు గౌరవం. తెలంగాణలో టీడీపీ...కాంగ్రెస్‌తో కలిస్తేనే బెటర్. అలా అయితే ఆ పార్టీలో ఉన్న ఆ కొందరైనా ఎమ్మెల్యేలు అవుతారు. ట్రిపుల్ తలాక్‌పై కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ పార్లమెంట్‌లో సంతకం పెట్టింది. ఎన్డీయేతో టీడీపీ లేదన్నదానికి ఇది అద్దం పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఉనికే లేదు. తమిళనాడులో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన సంగతి బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి.’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment