
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తలపెట్టిన మంత్రివర్గ విస్తరణను నిలిపివేయాలని టీ కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే ఆయన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫోన్ చేసి.. తన ఫిర్యాదును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రజత్‌కుమార్ వివరణ ఇస్తూ.. మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని, మంగళవారం తలపెట్టిన మంత్రివర్గ విస్తరణను యథాతథంగా చేపట్టవచ్చునని స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రశాంత్ రెడ్డి (నిజామాబాద్), నిరంజన్ రెడ్డి (మహబూబ్ నగర్), ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), జగదీశ్ రెడ్డి (నల్లగొండ), కొప్పుల ఈశ్వర్ (కరీంనగర్), ఎర్రబెల్లి దయాకర్ రావు (వరంగల్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్), ఈటల రాజేందర్ (కరీంనగర్), మల్లారెడ్డి (రంగారెడ్డి) మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment