
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ ఉత్కంఠ వీడటం లేదు. అధిష్టానం విశ్వప్రయత్నాలు చేసినా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ పంతం వదలడం లేదు. మంగళవారం ఉదయం జరిగిన రెండో దఫా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీకీ సచిన్ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలో పనిచేయలేమని, సీఎం పదవి మార్పు జరగాల్సిందేనని సచిన్ పైలట్ కీలక డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక సీఎం అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు బస చేస్తున్న జైపూర్‌లోని ఫైర్‌మంట్ హోటల్‌లోనే నేడు మరోసారి సీఎల్పీ సమావేశం జరిగింది.
(చదవండి: ఎమ్మెల్యేల బలం చూపిస్తూ సచిన్ వీడియో!)
అయితే, సీఎం క్యాంపులో 109 మంది ఎమ్మెల్యేలు లేరని, వారిలో 22 మంది మిస్సింగ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే అశోక్ గహ్లోత్ వెంట 87 మంది మాత్రమే ఉన్నారని పైలట్ వర్గం నేతలు చెప్తున్నారు. గహ్లోత్ ప్రభుత్వంలో మైనారిటీలో ఉందని అంటున్నారు. అశోక్ గహ్లోత్‌కు బానిసత్వం చేయలేమని, సీఎంగా ఆయన తప్ప వేరేవరైనా సరేనని సచిన్ పైలట్ వర్గం నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇక ఆదివారం నాటి వాట్సాప్ మెసేజ్‌లో 30 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని చెప్పిన పైలట్ సోమవారం రాత్రి ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గురుగ్రామ్‌లోని మానెసర్ హోటల్‌లో ఉన్న పైలట్ టీమ్‌లో దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు కనిపించారు.
(గహ్లోత్ గట్టెక్కినట్టే!)
Comments
Please login to add a commentAdd a comment