
యశవంతపుర : కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయాటనికి కన్నడ చిత్రసీమ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపుర చాముండేశ్వర నియోజకవర్గం నుండి ప్రచారం చేయనున్నట్లు నటీ సంజనా తెలిపారు. సినిరంగానికి చెందిన నటుడు యశ్ కేఆర్ నగర జేడీఎస్ అభ్యర్థి సారా మహేశ్, కృష్ణరాజ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రామదాస్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. బెంగళూరు నగరంలోని దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున లూస్ మాదయోగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాదామిలో శ్రీరాములు తరపున కూడ సినీ రంగానికి చెందిన నటులు ప్రచారం చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment