
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలు బీసీలకు దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీసీ రాజకీయ యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బీసీల రాజకీయ నిర్మాణం కోసం ‘ఓటు మాదే.. సీటు మాదే’నినాదంతో బీసీ రాజకీయ సమితి (బీఆర్‌ఎస్)ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
రాయితీలు, సబ్సిడీలు పేరుతో ప్రభుత్వాలు బీసీలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాధికారం దిశగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో బీఆర్‌ఎస్ పని చేస్తుందని వెల్లడించారు. సభకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఓబీసీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment