
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ఓటర్ల ముసాయిదా జాబితాను శోధించేందుకు వీలైన ఫార్మాట్‌లో ఇచ్చేలా ఎన్నికల సంఘం(ఈసీ)ని ఆదేశించాలంటూ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్ల జాబితాను ఏ ఫార్మాట్‌లో ఇవ్వాలనే అంశాన్ని ఈసీ మాత్రమే నిర్ణయిస్తుందని కోర్టు తెలిపింది. కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, సచిన్ పైలట్ వేసిన పిటిషన్లను శుక్రవారం ధర్మాసనం విచారించింది. మధ్యప్రదేశ్‌లో దాదాపు 60 లక్షలు, రాజస్తాన్‌లో సుమారు 41వేల నకిలీ ఓటర్లు ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని పిటిషనర్లు చెప్పారు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు ఇవ్వాలనీ, దీంతో జాబితాలో అర్హులైన ఓటర్లను గుర్తించే వీలుంటుందనీ, నకిలీవి, తప్పులుగా ముద్రితమైన పేర్లను కనిపెట్టొచ్చన్నారు. ‘ఈసీ నిబంధనల ప్రకారం పీడీఎఫ్‌లో ఇవ్వడం కుదరదు. టెక్స్›్ట ఫార్మాట్‌లో ఇచ్చిన వాటిని మీరే మార్చుకోవచ్చు’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment