![T Congress To Start Election Campaign In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/6/Mallu1_0.jpg.webp?itok=YTKP7M1c)
సాక్షి, హైదరాబాద్ : పీపుల్స్ ఎజెండాతో కాంగ్రెస్ ప్రజల వద్దకు వస్తుందని.. త్వరలోనే పీపుల్స్ గవర్నమెంట్‌ను తెచ్చుకోబోతున్నామని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ శనివారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.
ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టీ, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, సలీమ్ అహ్మద్, శ్రీనివాసన్, అంజన్ కుమార్ యాదవ్ పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ చేరుకుని.. మహంకాళి పోచమ్మ ఆలయంలో భట్టి, ఇతర నేతలు ప్రత్యేకంగా పూజలు చేసి పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా భట్టీ మాట్లాడుతూ..అమ్మవారి దయంతో ఫ్యూడల్స్‌ను తరిమికొట్టి పీపుల్స్ గవర్నమెంట్‌ను తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రజల మేలు కోరే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment