
సాక్షి, హైదరాబాద్: సర్వేల పేరుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న రిపబ్లిక్ తెలుగు చానల్‌పై అదనపు సీఈఓ జ్యోతి బుద్ధప్రకాశ్‌కు టీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జి దండే విఠల్ శనివారం ఫిర్యాదు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని సర్వే పేరుతో జరుగుతున్న ప్రచారంపై కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు విఠల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితపై మహబూబాబాద్‌లో రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, ప్రాణహాని ఉందంటున్న రేవంత్ తనకు తాను ఏమైనా చేసుకుని ఇతరు లపై నిందలు వేసే అవకాశం ఉందన్నారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. తమ ఫిర్యాదుకు స్పం దించిన అదనపు సీఈఓ వెంటనే చర్యలు తీసుకుం టామని హామీయిచ్చారన్నారు.
టీ న్యూస్‌పై సీఈవోకు ఫిర్యాదు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రసారాలు చేసిన టీ న్యూస్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీపీ శనివారం ఇక్కడ సీఈవో రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యక్తిగత దూషణలతో ప్రసారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment