
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయస్థాయిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తు న్న కూటమి పూర్తిగా అవకాశవాద కూటమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేత తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చంద్రబాబుకు పరిస్థితులు కలిసొస్తే తిరిగి బీజేపీలోనే చేరతారన్నా రు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హెచ్‌యూజే ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లభించే పరిస్థితులు లేవన్నారు. ఈ నేపథ్యంలో తాము గెలిచే సీట్లే కీలకంగా మారనున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌కు మేలు చేసేందుకే బీఎల్‌ఎఫ్ పోటీ చేస్తున్నట్టు వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్, కేసీఆర్ దుష్టపాలనను ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. వామపక్షాల ఐక్య త, విలీనం అంటూ మాట్లాడిన సీపీఐ నయవంచక కాంగ్రెస్ ధృతరాష్ట్ర కౌగిలికి చేరడం శోచనీయమన్నారు.
విద్య, వైద్యం, భూమి, ఇళ్లు, వ్యవసాయం, జీతం, సామాజిక న్యాయం వంటి ప్రత్యామ్నాయ విధానాలతో బీఎల్‌ఎఫ్ ఈ ఎన్నికల్లో పోటీచేస్తోందని చెప్పా రు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 14 వేల పంచాయతీల్లో రూ.5కే ‘బహుజన బువ్వ క్యాంటీ న్లు’, గుడిసెల్లో నివసించే వారికి 200 యూనిట్ల ఉచి త విద్యుత్, కూలీబంధు, రక్షణ పథకాలు అమలు చేస్తామన్నారు. 119 సీట్లలో బీసీలకు 50.4% సీట్లు, ఎస్సీలకు 23.5%, ఎస్టీలకు 12.6%, మైనారిటీలకు 8.5%, ఓసీలకు 5.5 శాతం సీట్లు కేటాయించినట్టు తమ్మినేని వెల్లడించారు.
కోదండరాంను శిఖండిలా ఉపయోగించుకుంటోంది: నల్లా
టీజేఎస్ అధినేత కోదండరాంను కాంగ్రెస్ పార్టీ శిఖండిలా ఉపయోగించుకుంటోందని బీఎల్‌ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సైంథవుడిగా మారిపోయారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో 119 సీట్లలో పోటీ చేయడమే బీఎల్‌ఎఫ్ సాధించిన నైతిక విజయమని వ్యాఖ్యానిం చారు. టీఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలని, 2023లో బీఎల్‌ఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment