టీడీపీ జెండా పట్టుకో లేదంటే.. వెంటాడి వేటాడుతా | TDP MLA Kuna Ravikumar Threats to YSRCP Activist in Phone | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండా పట్టుకో లేదంటే.. వెంటాడి వేటాడుతా

Published Tue, Feb 12 2019 7:11 AM | Last Updated on Tue, Feb 12 2019 7:39 AM

TDP MLA Kuna Ravikumar Threats to YSRCP Activist in Phone - Sakshi

శ్రీకాకుళం, పొందూరు: ఆయన ఓ ప్రజా ప్రతినిధి. ప్రజల కోసం పని చేయాల్సిన వ్యక్తి. చెప్పే ప్రతి మాట, వేసే ప్రతి అడుగులో ఆదర్శం, విలువలు చూపించాల్సిన మనిషి. కానీ మన జిల్లా ప్రజా ప్రతినిధి మాత్రం ఆదర్శాలను గాలికి వదిలేశారు. కేవలం నచ్చిన రాజకీయ పార్టీని ఎంచుకున్నాడనే కక్షతో ఓ సామాన్యుడిపై విరుచుకుపడ్డారు. రాయలేని భాషను ఉపయోగిస్తూ బెదిరింపులకు తెగబడ్డారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ దిగజారుడు రాజకీయాలకు పాల్ప డ్డారు. ఎమ్మెల్యే స్థాయికి తగని మాటలతో విలువలకు నిలువునా పాతరేశారు. గంగిరెడ్ల శివ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ తన పార్టీ జెండా పట్టుకోకుంటే వెంటాడివేటాడుతానని బెదిరించారు. ఆ ఫోన్‌ సంభాషణ సాగిందిలా..

విప్‌: వినమ్మా ఇవన్నీ నాకు అనవసరం. ఒక యాంగిల్‌ నన్ను చూశావు, రెండో యాంగిల్‌ కూడా నువ్వు చూడాలనుకుంటే నేను చెయ్యాలనుకుంటే ఏం చేస్తానన్నది నువ్వు చూద్దువు గానీ.
శివ: మీరు అలా అనడం సరికాదు సార్‌. ఇక్కడున్న డిస్టబెన్స్‌ వల్ల నేను బయటకు వెళ్లాను సార్‌.

విప్‌: ఈ రోజు డిస్టబెన్స్‌ ఏంటిరా, ఎవడ్రా డిస్టబెన్స్‌ మీకు. పనిచేసినప్పుడు డిస్టబెన్స్‌ లేదు.
శివ: మీ కార్యకర్తలు నన్ను అవాయిడ్‌ చేశారు. నేను మొదటి నుంచి వారితోనే తిరిగాను.

విప్‌: కార్యకర్తలు ఎవాయిడ్‌ చేయటమేంటి, తమాషానా.. మీ కార్యకర్త అంటావేంటి తమాషాగా మాట్లాడుతున్నావా నువ్వు. ఏ కార్యకర్త అనుకుని బీసీ కార్పొరేషన్‌ లోన్‌ నీకు చేశాను. తమాషా చేస్తున్నావేమి, వెధవ మాటలు మాట్లాడి నువ్వేదో పెద్ద పోటుగాడిలా మాట్లాడకు.
శివ: అలా అంటే నేనేమీ చెప్పలేను సార్‌.

విప్‌: నువ్వు మళ్లీ ఎక్కడైనా ఈ రోజు లగాయతు కనిపించినా కాన్సీక్వెన్సెస్‌ చాలా సీరియస్‌గా ఉంటాయి. ఆ తర్వాత మీ అమ్మ కాదు, మీ మేనమామ కాదు ఎవ్వడొచ్చినా సరే, నేను మనిషిని పట్టించుకోనంత వరకే, పట్టించుకొన్నానంటే ఎక్కడకు పాతేస్తానో నాకు తెలుసు, ఫస్ట్‌ అండ్‌ ఫైనల్‌ వార్నింగ్‌. నీకు చేతనైతే నీకు విశ్వాసముంటే నీవు మనిషివైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరుగు. లేదంటావు ఆ తర్వాత కాన్సీక్వెన్సీ ఏం చేయాలో అది చేస్తా. నేను ఒకే ఒక్కడినే క్షమిస్తాను. ఎవ్వడికో వాడికీ నచ్చలేదు ఆడేదో పూర్వం నుంచి పార్టీ జెండా పట్టుకొని ఉన్నాడు. వాడి ఊసు çనేను పట్టను. వాడి బతుకు వాడు బతుకుతాడు వాడు మటుకు వాడు ఉంటాడు. నువ్వు అది కాదు నువ్వు తిరగబడుతున్నావు. నువ్వు తిరగబడితే మాత్రం పాతాళానికి తొక్కేస్తాను.
శివ: నేను మీకు వ్యతిరేకంగా వెళ్లలేదు. నేనైతే

విప్‌: వినయ్యా నువ్వు ఇవన్నీ నాకు చెప్తావేంటి. మీరేం చేస్తారో ప్రతి అంగులం నాకు తెలుసు. నేనేం చూడటం లేదు అనుకుంటున్నారు. ఈ రోజు వరకు డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాను. ఈ రోజు లగాయితు రాజకీయం మళ్లీ చేస్తాను. ఇదీ వెరీ క్లియర్‌. చెబుతున్నాను. నువ్వు నీ ఆలోచన మార్చుకో, నీ టెండెన్సీ మార్చుకో, నీ నడక మార్చుకో, మార్చుకోకపోతే కాన్సిక్వెన్సీస్‌ భవిష్యత్‌లో చాలా సీరియస్‌గా ఉంటాయి. ఒకేమ్మా. నువ్వు నా కటౌట్‌లు తీసే స్థాయికి వచ్చిందంటే.
శివ: సార్‌ నేను మీ కటౌట్‌లు తీయలేదు సారు, నిన్న ఊర్లోనే లేను సార్‌.

విప్‌: మొత్తమంతా ఇప్పుడు జల్లెడ పట్టేస్తాను.
శివ: ఎవరో వచ్చారు

విప్‌: ఎవడా వచ్చిన నాకొడుకు, ఎవడా వచ్చినోడు?
శివ: కాంట్రాక్టర్లు ఎవరో వచ్చి కట్టుకెళ్లారంటే నాకు తెలియదు సార్‌.

విప్‌: సీతారాంకే కాదు...... నీకెవ్వడూ కాపాడడు గుర్తు పెట్టుకో. ఈ రోజు లగాయితు నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. నీకు చేతనైతే తెలుగు దేశం పార్టీ జెండా పట్టుకుని తిరుగూ. లేదనంటావా కాన్సీక్వెన్సెస్‌ చాలా సీరియస్‌గా ఉంటాయి. వెంటాడి వెంటాడి వేటాడుతాను. గుర్తు పెట్టుకోండి రైట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement