సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోట్లమంది వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు కంపెనీకి లీకు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం దాంతో ముడిపడి ఉన్న టీడీపీ ఆన్‌లైన్ సభ్యత్వాన్ని ఉన్నట్టుండి రద్దు చేసింది. ఆధార్‌తో అనుసంధానించి ఇప్పటివరకు పార్టీ ఆన్‌లైన్ సభ్యత్వాన్ని భారీఎత్తున నమోదు చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రైవేటు వ్యవహారాలకోసం ఆధార్‌ను అనుసంధానించకూడదు. కానీ టీడీపీ ఆధార్ ఆధారంగా ఆన్‌లైన్ సభ్యత్వాన్ని చేపట్టింది. ఓటర్ల జాబితా, ఆధార్ నంబర్లను పార్టీ సభ్యత్వాలకోసం అనుసంధానించింది. తాజా పరిణామాల నేపథ్యంలో హడావుడిగా టీడీపీ వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ సభ్యత్వాన్ని శనివారం నుంచి నిలిపివేసింది.
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!
డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం
చంద్రబాబు, లోకేష్‌ల కుట్రే
Comments
Please login to add a commentAdd a comment